Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూ ఎన్టీఆర్ సహా వారంతా నాకిష్టం, మద్దతివ్వండి - పవన్ ఎన్నికల నినాదం..!!

జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహం మార్చారు. ఎన్నికల నినాదం డిసైడ్ చేసారు. వైసీపీ లక్ష్యంగా పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. పొత్తుల అంశం ప్రస్తావించకుండానే పవన్..తన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రతీ సభలోనూ సహచర సినీ హీరోల పేర్లను చెబుతూ..వారంతా తనకు ఇష్టమని చెప్పుకొస్తున్నారు. అందరి హీరోల అభిమానులూ రాజకీయంగా జనసేకు అండగా నిలవాలని కోరుతున్నారు.

పవన్ కీలక వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ అమలాపురం సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో జనం బాగుండాలంటే జగన్‌ పోవాలని వ్యాఖ్యానించారు. హలో ఏపీ- బైబై వైసీపీ నినాదం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక ముఖ్యమంత్రికి క్లాస్‌వార్‌ గురించి మాట్లాడే హక్కులేదని తేల్చిచెప్పారు.

Pawan Kalyan

క్లాస్‌వార్‌ గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మాకు, జనసేనకే ఉందన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. 2.30లక్షల జాబ్‌ కేలెండర్‌ను లేకుండా చేసారని ఆరోపించారు. గోదావరి జిల్లాల రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేశాడు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కావాలా.. లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

హీరోల అభిమానులకు పిలుపు
పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా తరచూ సినీ హీరోలు..వారి అభిమానుల గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు అమలాపురం సభలోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేష్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, చిరంజీవి సహా హీరోలంతా తనకు ఇష్టమని పవన్ చెప్పుకొచ్చారు. అందరి హీరోల అభిమానులూ రాజకీయంగా జనసేకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హీరోలు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారని... వాళ్లు సినిమాలు చేస్తే కొంతమందికి పని దొరుకుతుందని చెప్పారు.

Pawan Kalyan

సినిమాలు విడుదలైతే స్థానికంగా చాలామంది వాటి మీద ఆధారపడి బతుకుతారని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారని..రూ 25 వేల కోట్ల ఆదాయం సంపాదించారని ఆరోపించారు. ఒక సారి ప్రధానికి చెప్పాలనిపిస్తోందని..మొన్న కలిసినప్పుడు చెప్పలేకపోయానని పవన్ వ్యాఖ్యానించారు.

చట్టసభలకు పంపండి
జనసేనను చట్టసభలకు పంపండి.. పార్లమెంటు బద్దలయ్యేలా జనసేన గొంతు ఉంటుందని పవన్ చెప్పకొచ్చారు. రాష్ట్రంలో మహిళా వివక్ష ఉందని...దీనిని తామ మారుస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కోనసీమ రైల్వేలైన్‌ను ఒక చాలెంజ్‌గా తీసుకుని.. తన జీవిత కాలంలో కచ్చితంగా తీసుకొస్తానని మాటిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan

ప్రజలకు విద్య, వైద్యం సంపూర్ణంగా అందేలా చూస్తానని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఇన్సూరెన్స్‌ చేయిస్తామని.. వైద్యం మొత్తం ప్రభుత్వమే భరించేలా మంచి పథకం తీసుకొస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎక్కడా టీడీపీ, బీజేపీ ప్రస్తావన చేయకుండా వైసీపీ లక్ష్యంగా పవన్ చేస్తున్న వారాహి యాత్రలో ఇప్పుడు హీరోలు..అభిమానుల ఓట్ బ్యాంక్ ను టార్గెట్ గా చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు సినీ..పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+