రాజమండ్రి నడిబొడ్డు నుంచి చెబుతున్నా - పవన్ కల్యాణ్..!!
రైతులను వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించారు. ప్రభుత్వం ప్రతీ రైతును ఆదుకోవాలని డిమాండ్ చేసారు. వర్షాలకు ముందే ధాన్య కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి రాదని పేర్కొన్నారు. దెబ్బ తిన్న ప్రతీ గింజకు ప్రభుత్వం పరిహారం చెల్లించేవరకూ పోరాటం చేస్తామని పవన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కేసులు పెడితే సహించేది లేదని చెప్పుకొచ్చారు.
రైతులు తరచూ కన్నీరు పెడుతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తూర్పు గోదావరిలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులతో పవన్ ముఖా ముఖి నిర్వహించారు. తెలంగాణ విభజన జరిగినప్పటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటాయన్నారని గుర్తు చేసారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించకపోవటం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్పందించకపోవటం కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. రైతులు రుణ మాఫీ కోరుకోవటం లేదని పావల వడ్డీకి రుణం ఇస్తే చాలని చెబుతున్నారని వివరించారు.

సకాలంలో గోనె సంచులు ఇవ్వని కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారని పవన్ చెప్పుకొచ్చారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ గింజ కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. జనసేనకు ఆవేదన చెప్పిన రైతులను వేదిస్తే వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. రాజమండ్రి నడిబొడ్డు నుంచి తాను చెబుతున్నానని..బాధలు చెప్పుకున్న రైతులను వేధించినా..కేసులు పెట్టినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ తరువాత రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో పవన్ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. పవన్ చేసిన విమర్శల పైన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. పవన్ కు పంటల గురించి తెలియదని, ప్రభుత్వం రైతుల కు అండగా నిలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications