రోడ్డుపైకి ఫ్యాన్స్, ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కళ్యాణ్: బాబుతో ఏం మాట్లాడుతారు?

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

అక్కడ ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. అనంతరం గన్నవరం నుంచి విజయవాడ బయలుదేరారు. పవన్‌ను చూసేందుకు చాలామంది అభిమానులు వచ్చారు. జై పవన్, జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Recommended Video

    Pawan Kalyan meets Chandrababu Naidu, Fans Bike rally
    ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కళ్యాణ్

    ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కళ్యాణ్

    అంతమంది అభిమానులు రావడంతో ఆ దారి చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో పవన్ కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అనంతరం ఆయన హార్వార్డ్ టీంతో కలిసి విజయవాడ చేరుకున్నారు.

    చాలా రోజుల తర్వాత కలయిక

    చాలా రోజుల తర్వాత కలయిక

    ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్ధానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యలతోపాటు, హార్వర్డ్ యూనివర్సిటీ బృందంతో చేయించిన సర్వేలో వెలుగు చూసిన నిజాలను చంద్రబాబు ఎదుట ఉంచనున్నారు. సమస్య మూలాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని కోరనున్నారు.

    ఈ అంశాలు చంద్రబాబు ముందుకు

    ఈ అంశాలు చంద్రబాబు ముందుకు

    ఇందులో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ ఉద్ధానంలో నిర్వహించిన అధ్యయనం అంశాలను చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. రక్షిత మంచినీటి ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+