వీళ్లకెందుకీ శిక్ష, నేనే నాయకత్వం వహిస్తా: ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఫాతిమా కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. వందమంది విద్యార్థులం ఉన్నామని, మా బాధను అర్థం చేసుకోని మీరే న్యాయం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను కోరారు.

  Pawan Kalyan Uttarandhra Tour Updates | Oneindia Telugu

  పవన్ కళ్యాణ్ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫాతిమా విద్యార్థుల సమస్య గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు.. అనే విషయాలపై ఆరా తీశారు. 

  మాకు మీరే ఏదైనా చేయగలరు, భావోద్వేగం

  మాకు మీరే ఏదైనా చేయగలరు, భావోద్వేగం

  మాకు ఏదైనా సాయం చేయాలనుకుంటే మీరు మాత్రమే చేయగలరని ఓ విద్యార్థిని తల్లి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన వాగ్దానం చూసి తాము వేరే కాలేజీలో సీటు వచ్చినా దానిని రద్దు చేసుకున్నామని చెప్పారు. మీలాంటి వారు మాత్రమే మాకు ఏమైనా చేయగలరన్నారు. పవన్ ఎదుట వారు భావోద్వేగానికి గురయ్యారు.

  రెండేళ్లుగా అందరి చుట్టూ తిరుగుతున్నాం

  రెండేళ్లుగా అందరి చుట్టూ తిరుగుతున్నాం

  కాలేజీ యాజమాన్యం చేసిన పనికి తాము రోడ్డున పడ్డామని విద్యార్థులు పవన్‌కు చెప్పుకొని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రెండేళ్లుగా అందరి చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదన్నారు.

  భవిష్యత్తు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటా

  భవిష్యత్తు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటా


  విద్యార్థులు, తల్లిదండ్రులు సమస్యలు చెప్పిన అనంతరం జనసేనాని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. విద్యార్థులే జాతీయ సంపద అన్నారు.

  నేనే నాయకత్వం వహిస్తానని హెచ్చరిక

  నేనే నాయకత్వం వహిస్తానని హెచ్చరిక

  ప్రభుత్వాల తరఫున విద్యార్థులకు అన్యాయం జరిగితే, ఇబ్బందులకు గురైతే వారి భవిష్యత్తు కోసం వారి తరఫున నేనే నాయకత్వం వహిస్తానని ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేశారు.

  మాకు మంచి ర్యాంకులు వస్తాయనే గ్యారంటీ ఏమిటి

  మాకు మంచి ర్యాంకులు వస్తాయనే గ్యారంటీ ఏమిటి

  తమను మళ్లీ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు పంపిస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ మళ్లీ మంచి ర్యాంకు వస్తుందని గ్యారెంటీ ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్ష ఎందుకు అనుభవించాలన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస రావుతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో మాత్రం ఎవరూ ఆడుకోవద్దన్నారు. ఎవరు బెదిరించినా భయపడవద్దని, తాను, జనసేన అండగా ఉంటానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan meets Fatima College Students on Friday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి