బాలయ్యతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ భేటీ: రాజకీయ చర్చ, ఫ్యాన్స్ రచ్చ

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరూ సినీ ప్రముఖులేకాకుండా రాజకీయాల్లోనూ కీలక నేతలు కావడం తెలిసిందే.

బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్

బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్

అన్నపూర్ణ స్టూడియోలు బాలయ్య, పవన్ నటిస్తున్న రెండు సినిమాల చిత్రీకరణ ఒకే సమయంలో జరుగుతుండటంతో వీరిద్దరి భేటీ జరిగింది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి సెట్స్‌కు వెళ్లి బాలయ్యను కలిశారు పవన్ కళ్యాణ్. చిత్ర బృందంతోనూ కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వీరసింహారెడ్డి చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వీరసింహారెడ్డితో హరిహర వీరమల్లు అంటూ ఫ్యాన్స్ రచ్చ

వీరసింహారెడ్డితో హరిహర వీరమల్లు అంటూ ఫ్యాన్స్ రచ్చ

మరోవైపు, బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్-2కి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ హాజరవుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన ఏదీ రానప్పటికీ.. వీరి భేటీతో బాలయ్య టాక్ షోలో పవన్ కనిపిస్తారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఫొటోలు వైరల్ కావడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. వీరసింహారెడ్డితో హరిహర వీరమల్లు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలిస్తే అన్‌స్టాపబుల్-2 మరో లెవల్లో ఉంటుందంటూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా బాలయ్య-పవన్ సుదీర్ఘ భేటీ

ఏపీ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా బాలయ్య-పవన్ సుదీర్ఘ భేటీ

అయితే, ఆ తర్వాత బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ ఏకాంతంగా 20 నిమిషాలు భేటీ కావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా కానివ్వనని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. ఓట్లు చీలకుండా అవసరమైన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అటువైపు టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం సుముఖంగా ఉన్నది బహిరంగ రహస్యంగానే కొనసాగుతోంది. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేతగా ఉన్న బాలకృష్ణతో 20 నిమిషాలు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఏపీ రాజకీయాలపైనా వీరిద్దరూ ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+