మీడియాతో చంద్రబాబు: పక్కనే పవన్ కళ్యాణ్(పిక్చర్స్)
విశాఖపట్నం: పెను తుఫాను కారణంగా అపార నష్టానికి గురైన విశాఖను పునర్నిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖకు కొత్త ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పక్కనే సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. అంతకుముందు పవన్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. విశాఖకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు శాశ్వతంగా పునర్నిర్మాణం చేపడతామని చంద్రబాబు అన్నారు.
ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి ప్రముఖులు, సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. బాధితులను ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు సాయం చేస్తామని ముందుకు వస్తున్నాయని తెలిపారు. సామాజిక బాధ్యతగా వ్యక్తులు, సంస్థలు సాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. పెను తుఫాను వల్ల తీవ్ర నష్టం జరిగిందని చెప్పిన ఆయన, ప్రతీ ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

విశాఖలో పవన్
పెను తుఫాను కారణంగా అపార నష్టానికి గురైన విశాఖను పునర్నిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖకు కొత్త ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

విశాఖలో పవన్
ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పక్కనే సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నారు.

పవన్ కళ్యాణ్
అంతకుముందు పవన్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. విశాఖకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు శాశ్వతంగా పునర్నిర్మాణం చేపడతామని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి ప్రముఖులు, సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్
బాధితులను ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు సాయం చేస్తామని ముందుకు వస్తున్నాయని తెలిపారు.
నాలుగు రోజులుగా చేయాల్సిన అన్ని సహాయక కార్యక్రమాలు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితో మూడు సార్లు మాట్లాడానని చెప్పిన చంద్రబాబు.. అక్కడ్నుంచి 250లారీల ఆలుగడ్డలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయని చెప్పారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించారని తెలిపారు. మంత్రులు, అధికారులు బాగా పని చేస్తున్నారని అన్నారు. ఎంత ఖర్చయినా ప్రజలను ఆదుకుంటామని, వారి బాధలు తీర్చాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.
భారీ నష్టం జరగకుండా విశాఖ ప్లాంటుకు విద్యుత్ అందించామని చంద్రబాబు తెలిపారు. రెండ్రోజుల్లో అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని చెప్పారు. 15రోజులు పడుతుందనుకున్న విద్యుత్ సమస్యను మూడు రోజుల్లో తీర్చేశామని చెప్పారు. విశాఖ, హెరిటేజ్‌లను రూ. 10 తక్కువకే పాలను అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. విశాఖ 3.85 లక్షల లీటర్లు, హెరిటేజ్ 65వేల లీటర్ల పాలను అందించాయని తెలిపారు.
విశాఖకు పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. నేటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తామని అన్నారు. కేంద్రం నుంచి కూడా సహాయక బృందాలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పెనుతుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విశాఖను తయారు చేస్తామని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఎయిర్ పోర్టును రేకులతో నిర్మిస్తారా? అని ఎయిర్ పోర్ట్ నిర్మాణ సంస్థను ప్రశ్నించారు. శుక్రవారం నాటికి విశాఖలో 90శాతం పరిస్థితిలు కుదుటపడతాయని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన సహాయక కార్యక్రమాలు తనను సంతృప్తి పర్చలేదని అన్నారువిశాఖలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవసరమని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందించారు. తుఫాను వల్ల వేల కోట్ల నష్టం జరిగిందని పవన్ చెప్పారు. చంద్రబాబుకు సవాళ్లను ఎదుర్కొనే లక్షణాలు ఉన్నాయని పవన్ అన్నారు. విపత్తు సహాయ కార్యక్రమాల్లో మరోసారి నిరూపితమైందని చెప్పారు. విపత్తు సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆపత్కాలంలో అక్కడే ఉండి విశాఖ వాసులకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తుఫాను వల్ల దెబ్బతిన్న విశాఖను చూస్తే బాధ వేసిందన్నారు. విశాఖలో కూడా సినీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కాగా, జిఎమ్మార్ సంస్థ తుఫాను సహాయార్థం రూ. 2.5 కోట్లను ప్రకటించింది.












Click it and Unblock the Notifications