వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పు కోసం: అప్పుడు పవన్ కళ్యాణ్ గదిలో నుంచి బయటకు రాలేదట

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హార్వార్డ్ యూనివర్సిటీ టీంను ఏపీకి దించి, అందరి మన్ననలు పొందుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హార్వార్డ్ యూనివర్సిటీ టీంను ఏపీకి దించి, అందరి మన్ననలు పొందుతున్నారు.

వారిని తిట్టవచ్చు కానీ, నా కొడుకు బాధపెడితే, జగన్‌ని అడుగుతా: పవన్ కళ్యాణ్వారిని తిట్టవచ్చు కానీ, నా కొడుకు బాధపెడితే, జగన్‌ని అడుగుతా: పవన్ కళ్యాణ్

ఉద్ధానం కిడ్నీ సమస్య పైన ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతం కదలిక రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. ఇది అందరి మన్ననలు అందుకుంది. తన పోరాటం సమస్యల పైనే తప్ప, ప్రభుత్వం, పార్టీల పైన కాదని పవన్ మొదటి నుంచి చెబుతున్నారు.

ఉద్దానంలో ఇబ్బంది

ఉద్దానంలో ఇబ్బంది

ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలపై కొత్త పంథాలో యుద్ధం ప్రకటించారు. ఉద్దానం అంటే కిడ్నీ సమస్యలే కనిపిస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేని బతుకులు, ఏళ్ల తరబడి ఉన్న ఘోరమైన పరిస్థితులు ఉద్దానం చుట్టుపక్కల ఊళ్లన్నింటిలోనూ అందరికీ ఒకే రకమైన ఇబ్బందులు.

ఇప్పటి దాకా పరిష్కారం లేదు

ఇప్పటి దాకా పరిష్కారం లేదు

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం సానుభూతి చూపించింది. ఈ మధ్య అయితే వాటర్ ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్లు పెట్టి కాస్త భరోసా అయితే ఇచ్చిందేమో కానీ పరిష్కారానికి దారి మాత్రం ఇప్పటి వరకూ చూపించలేదు.

చలించిన పవన్ కళ్యాణ్

చలించిన పవన్ కళ్యాణ్

పైకి కనిపిస్తున్న సమస్యను చూపిస్తుంది కానీ లోతుకెళ్లి మూలాలు తవ్వితీసి తెగులును చూపించింది లేదు. అక్కడి పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు.

అప్పుడు మూడు రోజులు బయటకు రాలేదట

అప్పుడు మూడు రోజులు బయటకు రాలేదట

ఉద్దానం వెళ్లి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు తన గదిలో నుంచి బయటకు రాలేదట. ఈ విషయం ఆయన సన్నిహితులకు తెలుసని చెబుతున్నారు. హార్వార్డ్ బృందంతో ఉద్దాన బాధితులకు పరీక్ష చేయించారు. చంద్రబాబుతో హార్వార్డ్ బృందాన్ని భేటీ అయ్యేలా చూస్తున్నారు. పవన్ తొలి ప్రయత్నమే పెద్దది, చాలా ఉన్నతమైనదిగా అందరూ చూస్తున్నారు.

English summary
Jana Sena party Chief Pawan Kalyan met with Harvard doctors team over Uddanam kidney problems. at the Visakha convention centre on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X