ఆ సామాజికవర్గ ఓటర్ల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్త ఎత్తుగడ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారా? వివిధ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీశారా? ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యంత కీలక ఓటు బ్యాంకు గా ఉన్న గంగపుత్రుల ఓటు బ్యాంకు పై పవన్ కళ్యాణ్ కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతు కోసం ఇప్పటి నుండే పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో రంగంలోకి దిగుతున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ఓటు బ్యాంకు కీలకంగా కావడంతో, వారి ఓటు బ్యాంకు ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, మత్స్యకారులను ఆకర్షించడానికి వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు గంగపుత్రుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ , అనేక మార్లు గంగపుత్రుల సమస్యల కోసం ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే మత్స్యకార సామాజిక వర్గానికి దగ్గర కావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రేపు యువజన దినోత్సవం సందర్భంగా సిక్కోలు జిల్లాలో యువశక్తి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.

రేపు సిక్కోలు జిల్లాలో పవన్ కళ్యాణ్ యువశక్తి .. టార్గెట్ వారే
పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమం నేపథ్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ గత నెలలోనే సిక్కోలు లో పర్యటించి పార్టీ శ్రేణులను, కార్యక్రమం నిర్వహణకు సన్నద్ధం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులతో పాటు, పెద్ద ఎత్తున మత్స్యకారులు రేపు జరగనున్న యువశక్తి కార్యక్రమానికి హాజరు అయ్యేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన నేతలకు బాధ్యతలు కట్టబెట్టిన నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. మత్స్యకారుల ఓటు బ్యాంకు ను టార్గెట్ చేసుకొని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న జనసేన ఏపీ ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా కూడా టార్గెట్ చేయనున్నారు.

పవన్ యువ శక్తిని టార్గెట్ చేస్తున్న ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు
వలసల నివారణ, ఉపాధి మార్గాల పై అవసరమైన సూచనలు, సలహాలు తదితర అంశాలపై వందమంది యువతీ యువకులతో లావేరు మండలం తాళ్లవలస లో చేపట్టనున్న యువశక్తి కార్యక్రమం సక్సెస్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. గతేడాది ఫిబ్రవరి 20న నరసాపురంలో 'మత్సకార అభ్యున్నతి సభ' కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్.

పవన్ ను నమ్మొద్దని ప్రచారం..
మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు , నాదెండ్ల మనోహర్ కు ఏమి తెలుసు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి వారు టార్గెట్ చేస్తున్నారు. మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు, నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటే తిట్టిపోస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో చేశామని ఆయన చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్రలో మత్స్యకారులు ఓటు బ్యాంకు ను టార్గెట్ చేస్తూ జనసేన, జనసేన ను టార్గెట్ చేస్తూ వైసిపి పోరు సాగుతుంది.












Click it and Unblock the Notifications