లేడీస్ మాట్లాడమన్నారని..: ప్లకార్డుతో బాబుకు పవన్ కళ్యాణ్ షాక్!
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏపీలో మద్య పాన నిషేధంపై పోరాటం చేయనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏపీలో మద్య పాన నిషేధంపై పోరాటం చేయనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆయన ఉద్ధానం కిడ్నీ సమస్యలపై జనసేన ఆధ్వర్యంలో సింపోజియం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్ధానం సమస్యపై మాట్లాడారు. మేధాశక్తితో అణుబాంబు కనిపెట్టినప్పుడు ఉద్ధానం సమస్యకు పరిష్కారం కనిపెట్టలేమా అన్నారు.

మద్యం షాపులు వద్దని ప్లకార్డు
అనంతరం ఆయన ఏపీలో ఇటీవల రగులుకున్న మద్యం షాపుల అంశంపై మాట్లాడకుండా స్పందించారు. ఈ విషయం మాట్లాడమని తనను కొందరు కోరారని చెబుతూ.. జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దని ప్లకార్డు ప్రదర్శించారు.

తదుపరి యుద్ధం దేనిపైనో చెప్పేశారా?
దీంతో పవన్ కళ్యాణ్ తన తదుపరి యుద్ధం దేని పైనో చెప్పకనే చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ ఏపీ హక్కులు, కేంద్రం స్పందనపై తీవ్రంగా స్పందించేవారు. కేంద్రం తీరును ప్రశ్నించేవారు.

పెద్దగా విమర్శించింది లేదు
రాష్ట్రంలోని అధికార, విపక్షాలను మాత్రం ఆయన పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ అదే వ్యూహం అమలు చేస్తున్నప్పటికీ, సమస్యల పరిష్కారానికి జగన్‌ను కలిసేందుకు అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం.

ప్రతిపక్ష నేతకు ఓకే
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నాడన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతలను కలుస్తానని చెప్పడం ఆసక్తి రేపుతోంది.

మహిళలు మాట్లాడమన్నారంటూ..
జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ అధికార పక్షాన్ని హెచ్చరించడం కూడా టిడిపి విధానాల పట్ల పవన్ కళ్యాణ్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? అన్న అనుమానాలు రేపుతున్నాయి. మహిళలు దీనిపై తనను మాట్లాడమన్నారని, ప్రస్తుతం తాను దీనిపై మాట్లాడలేనని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications