నువ్వు మాట్లాడకపోతే బెటర్: పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ అభిమానులకు సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ తాజాగా శనివారంనాడు ట్వీట్ చేసిన పోస్టును తిప్పికొట్టారు.

తాను రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద ఉంటానని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహేష్ కత్తి పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. మీరో నేనో తేల్చుుకుందామని కూడా న్నారు.

 పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యకు ఇదీ జవాబు

పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యకు ఇదీ జవాబు

"ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!" అని మహేష్ కత్తి పవన్ కల్యాణ్ శనివారం ఉదయం చేసిన ట్వీట్‌కు సమాధానంగా అన్నారు.

Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !
 పవన్ కల్యాణ్ ట్వీట్ ఇదీ.

పవన్ కల్యాణ్ ట్వీట్ ఇదీ.

వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకానివాళ్లు... నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాట ఎవరు చెప్పారో తెలియదు గానీ ఓ సీనియర్ జర్నలిస్టు ఆ ఉటంకింపుతో ఈ రోజు ఉదయం గ్రీట్ చేశాడని ఆయన చెప్పారు. దాన్ని పంచుకోవాలని అనిపించిందని, శుభదినమని ఆయన శనివారం ఉదయం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మన చుట్టూ ఉన్న కుల విభజన, కుల సమీకరణ, అధికా రాజకీయాలు నిజంగానే హెచ్చరిక నిలిచాయని ఆయన అన్నారు.

 పిల్లలను కూడా ఇలా..

పిల్లలను కూడా ఇలా..

నీ ఫ్యాన్స్ పేరు మీద పిల్లలను కూడా వెర్రివాళ్లను చేస్తున్నావని మహేష్ కత్తి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మరో వ్యాఖ్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పిల్లలు మాట్లాడిన వీడియోను పోస్టు చేసి ఆ వ్యాఖ్యలు చేశారు. నీ పిల్ల ఫ్యాన్స్‌ తల్లిదండ్రులను హెచ్చరించడానికి పేరెంట్, టీచర్స్ సమావేశం కోసం ఓ అంతర్జాతీయ పాఠశాలతో మాట్లాడుతానని, వారిలో చాలా మందికి కౌన్సెలింగ్, మానసిక జాగరూకత అవసరమని ఆయన అన్నారు.

 నీకు డబ్బులొచ్చేంత వరకు...

నీకు డబ్బులొచ్చేంత వరకు...

నీ సినిమాలపై వారు డబ్బులు వెచ్చించేంత వరకు వారిని నువ్వు పట్టించుకోవనే విషయం నాకు తెలుసునని మహేష్ కత్తి అన్నారు. నీకు ఓట్లు వేసేందుకు ప్రభావితం చేస్తారని అన్నారు. నువ్వు జబ్బు మనిషివి, నీపై జాలి పడుతున్నానని ఆయన పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cine critic Mahesh Kathi retaliated Jana Sena chief Pawan Kalyan comments on caste.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి