చంద్రబాబుకు పవన్ బిగ్ రిలీఫ్,కానీ - అక్కడే ట్విస్ట్..!!

పార్టీ కేడర్ కు డిప్యూటీ సీఎం పవన్ బహిరంగ లేఖ విడుదల చేసారు. కొద్ది రోజులుగా చోటు చేసు
కొంటున్న పరిణామాలతో కూటమి నేతలు అప్రమత్తం అయ్యారు. డిప్యూటీ సీఎం పదవి పైన రచ్చ జరిగింది. ఆ తరువాత టీడీపీ - జనసేన పార్టీలు ఆ అంశం పైన ఎవరూ స్పందించవద్దని కోరారు. తాజాగా కూటమిలో భాగస్వామ్య పక్షంగా పార్టీ పైన ఉన్న బాధ్యతలను వివరిస్తూ కేడర్ కు పవన్ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేసారు. ఈ లేఖతో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వానికి బిగ్ రిలీఫ్ గా చర్చ జరుగుతోంది.

పవన్ లేఖతో
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ కేడర్ కు లేఖ రాసారు. అందులో పార్టీ లక్ష్యాలను వివరి స్తూనే.. తాజా పరిణామాల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ అధికారిక ఎక్స్‌ ఖాతా లో దాన్ని పోస్ట్‌ చేశారు. 2024 ఎన్నికల్లో ఫలితాల నుంచి తాజా పరిణామాల వరకు ప్రస్తావన చేసారు. వైసీపీ పాలనలో అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్జేసి అప్పుల ఏపీగా మార్చటం పట్ల ప్రజలు విసుగెత్తిన ఫలితమే ఈ విజయమని వివరించారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan s open letter to janasena supporters big relief for TDP amid latest controversy

పదవుల కోసం కాదు
ఏడు నెలల కాలంలో తమ సక్సెస్ గురించి పవన్ వివరించారు. ఒక్కొక్కటిగా అమలుచేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వీటన్నింటికీ కారణం 5 కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్ అందించాలనే సంకల్పమేనని స్పష్టంచేశారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని పవన్ స్పష్టం చేసారు. భవిష్యత్​లోనూ చేయనని స్పష్టంచేశారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడం, వారికి అండగా నిలబడడం, పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే తనకు తెలుసని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేసారు.

టీడీపీకి రీలీఫ్
ఇక.. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కల్యాణ్ లేఖలో స్పష్టం చేసారు. పవన్ లేఖ తో టీడీపీకి బిగ్ రిలీఫ్ గా కనిపిస్తోంది. పదవుల పైన పవన్ చేసిన వ్యాఖ్యల పైనే ఇప్పుడు ప్రధానం గా చర్చ సాగుతోంది. జనసేన కేడర్ పవన్ ను కీలక పదవిలో చూడాలని భావిస్తున్నారు. కానీ, పవన్ మాత్రం తాను పదవుల కోసం రాజకీయం చేయనని ఈ లేఖ ద్వారా తేల్చి చెప్పారు. దీంతో, టీడీపీ నాయకత్వం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అదే సమయంలో ప్లీనరీ వేదికగా పవన్ కొత్త కార్యాచరణ పైన ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+