బాలకృష్ణపై పవన్ కల్యాణ్ అభిప్రాయం.. ఓపెన్ గా చెప్పేశారే!

ఇదే ఆఖరు సినిమా అని వదినకు ఫోన్ చేసి చెప్పేశాను

రాజకీయాల్లోకి వస్తానని తాను అనుకోలేదని, కాకపోతే సాటి మనిషికి సాయం చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన మాత్రం ఉండేదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆహా ఓటీటీలో బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 కార్యక్రమానికి పవన్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన తన మనసులోని భావాలను బాలకృష్ణతో పంచుకున్నారు.

చిన్నతనం నుంచి సైలెంట్ గా ఉండేవాడినని, నటనపై తనకెప్పుడూ ఆసక్తి కలగలేదని, పది మంది ఒకచోట ఉంటే కారులోనుంచి బయటకు కూడా వచ్చేవాణ్ని కాదన్నారు. రచయిత అవుదామనుకున్నానని, లేదంటే సినిమా డైరెక్టర్ అవుదామనుకున్నానని, కంప్యూటర్ గ్రాఫిక్స్ వైపు వెళ్లాలనుకున్నానన్నారు. తన వదిన, అత్తయ్యల ప్రోద్భలంతోనే నటనలోకి రావాల్సి వచ్చిందన్నారు. ఖుషీ తర్వాత మరో నాలుగైదు సినిమాలు మానేయాలనుకున్నానని, లేదంటే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాలనుకున్నానని వెల్లడించారు.

Pawan Kalyan opinion on nandamuri Balakrishna is open

సుస్వాగతం సినిమా షూటింగ్‌లో బస్సుపై డ్యాన్స్‌ వేయాలని చెప్పారన్నారు. అయితే తనకు బాగా సిగ్గుగా అనిపించిందని, అంతమంది మధ్య డ్యాన్స్ ఎలా వేయాలా? అని మధనపడ్డానన్నారు. ఇదే ఆఖరు సినిమా అని వదనకు ఫోన్ చేసి చెప్పేశా. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా నేనేనా.. నాకే జరుగుతోందా? అని అనిపిస్తోందని పవన్ అన్నారు. బాలకృష్ణ ముక్కుసూటి వ్యక్తి అని, లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడరని, మంచో చెడో ముఖం మీదే అనేస్తారని, ఆయన ప్రేమ పంచినా, గొడవ పెట్టుకున్నా అలాగే ఉంటుందన్నారు.

గురువారం రాత్రి నుంచి ప్రసారమవుతున్న ఈ షో రెండో ఎపిసోడ్ 10వ తేదీన ప్రసారం కానుంది. ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన 14 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. దీనికి సంబంధించి ఆహా పవన్ బ్లాక్ చొక్కా వేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ సోషల్ మీడియాలో విషయాన్ని షేర్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+