వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగా చీలిక: బాబు, జగన్ పార్టీల్లో పవన్ ఫీవర్! టిలోను

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పన్ కల్యాణ్ పార్టీ పెట్టనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పవన్ జనసేన పార్టీతో ముందుకు వస్తున్నారు. దీంతో ఆ కొత్త పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పవన్ ప్రభావం ముఖ్యంగా కాపులు, యువత పైన ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో యువత తెలుగుదేశం పార్టీ వైపు చూస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2009లో ప్రజారాజ్యం వైపుకు వెళ్లిన కాపు సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే టిడిపి వైపు చూస్తోందని అంటున్నారు. ఇప్పుడు పవన్ పార్టీ పెడితే యువత, కాపులు జన సేన వైపు వెళ్తారనే ఆందోళన టిడిపిలో ఉందంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి యువతలో ఇమేజ్ ఉంది. దీంతో ఆ పార్టీ కూడా యువ ఓటర్లు అటువైపు వెళ్తారేమోననే ఆందోళన చెందుతున్నారు. ఇక.. పవన్ ప్రభావం తెలంగాణలో అంతగా ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితితో సహా తెలంగాణలోని ఇతర పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే, పోటీ చేస్తే మాత్రం తమ పైన ప్రభావం పడుతుందని మాత్రం వారు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

 పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ కొత్త పార్టీ దాదాపు ఖరారైంది. ఆయన జనసేన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14న పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పవన్ పార్టీ ఫీవర్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉందంటున్నారు. 2009లో టిడిపి అధికారంలోకి రాకపోవడానికి పిఆర్పీ, లోక్‌సత్తా పార్టీలే అనే వాదన ఉంది. ఇప్పుడు సీమాంధ్రలో పుంజుకుంటున్న సమయంలో పవన్, కిరణ్‌ల కొత్త పార్టీ తమకు దెబ్బే అంటున్నారు. ఈ విషయాన్ని టిడిపి సీనియర్ నేత మురళీ మోహన్ రెండురోజుల క్రితం అంగీకరించారు. కిరణ్ పార్టీ ప్రభావం అంతగా లేకపోయినా... పవన్ ప్రభావం మాత్రం బాగా ఉంటుందని భావిస్తున్నారు.

జగన్

జగన్

పవన్ పార్టీ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోను ఆందోళన ఉందంటున్నారు. జగన్ యువకుడు కావడంతో ఆ పార్టీ వైపు సీమాంధ్రలో యువత చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో ఇమేజ్ ఉన్న పవన్ పార్టీ పెట్టడం వారికి మింగుడు పడటం లేదంటున్నారు.

చిరంజీవి

చిరంజీవి

పవన్ కల్యాణ్ పార్టీ కారణంగా ఆయన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉన్న కాంగ్రెసు పార్టీ పైన ఎక్కువ ప్రభావం పడుతుందంటున్నారు. చిరంజీవి తన పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు చాలామంది కాపులు దూరమయ్యారని, ఇప్పుడు పవన్ పార్టీ పెట్టడంతో మిగిలిన వారు కూడా దూరమవుతారని అంటున్నారు. అలాగే మెగా అభిమానులలో కూడా చీలిక వచ్చి, ఓట్లు చీలిపోతాయని చెబుతున్నారు. మెగా సోదరులను ఎక్కువగా అభిమానించే యువత చిరు కంటే పవన్ వైపే మొగ్గవచ్చునని చెబుతున్నారు.

 తెలంగాణలో

తెలంగాణలో

పవన్ కల్యాణ్ ప్రభావం తెలంగాణ ప్రాంతంలో అంతగా ఉండదని తెలంగాణ నేతలు చెబుతున్నప్పటికీ... తమ గెలుపోటములపై ఆయన పార్టీ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

English summary
It is said that all parties have fear of Power Star Pawan Kalyan Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X