విశాఖఉక్కు కోసం ఏపీ ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఒత్తిడికి పవన్ కళ్యాణ్ అదిరిపోయే ప్లాన్.. రేపటినుండే అమలు!!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల, ఉద్యోగుల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. ఇక తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జనసేన డిజిటల్ వేదికగా క్యాంపెయిన్ ద్వారా విశాఖ ఉక్కు నిన్నాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నించాలని, కేంద్రాన్ని జగన్ సర్కార్ అడగకపోతే తప్పు చేసినట్టు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది లోక్సభ సభ్యులు ఉండి కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడడం కోసం అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఎంపీలు, జగన్ సర్కార్ బాధ్యత గుర్తు చెయ్యటం కోసమే డిజిటల్ క్యాంపెయిన్

వైసీపీ ఎంపీలు, జగన్ సర్కార్ బాధ్యత గుర్తు చెయ్యటం కోసమే డిజిటల్ క్యాంపెయిన్

ఇక వైసీపీ ఎంపీలు, వైసిపి ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపి తో పాటుగా టిడిపి ఎంపీలు కూడా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలని, ఫ్లకార్డుతో నిరసన ప్రదర్శనలు చేయాలని ఈ బాధ్యతను వారికి తెలియజేసేలా మన రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహించనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి ఒక్కరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలన్న ఆకాక్షను వ్యక్తం చేస్తూ ఎంపీలకు ట్యాగ్ చెయ్యాలని సూచించారు.

డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నం

డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నం


పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు పవన్ కళ్యాణ్ .ఎంతోమంది బలిదానాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గళం విప్పని కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీల బాధ్యతలను గుర్తు చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు .

 రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావలసిన సమయం

రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావలసిన సమయం

జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో .. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రతి ఆంధ్రుడిని కదిలించాలి అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావలసిన సమయం ఇదే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నాటి నుండి ఈరోజు వరకు ఏ రాజకీయ పార్టీ కలిసి రాలేదని, రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ప్రతి పార్టీ లక్ష్యం ప్రజాసేవే కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించి ముందుకు రావాలన్నారు పవన్ కళ్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+