టార్గెట్ 2019: అనంతపురంలో జనసేన ఆఫీస్, టిడిపికి చెక్ పెట్టే ప్లాన్ ఇదే
అనంతపురం: 2019 ఎన్నికల కోసం జనసేన చీప్ పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.
2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇటీవలే ఏపీ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. అంతేకాదు అధికార పార్టీలపై విరుచుకుపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమస్యలపై కూడ పార్టీ నాయకత్వం అధ్యయనం చేస్తోంది.
అనంతపురంలో జనసేన కార్యాలయం
అనంతపురంలో త్వరలోనే జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ అనంతపురంలో శంకుస్థాపన చేయనున్నారు. గుత్తి రోడ్డులోని రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

అనంతపురం నుండే పవన్ పోటీ
2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనంతపురం నుండి పోటీ చేయనున్నారు.ఈ మేరకు అనంతపురం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని భావిస్తున్నందున తొలుత ఈ జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ నాయత్వం చర్యలు మొదలు పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రజా సమస్యలపై జనసేన పోరాటం
ప్రజా సమస్యలను తీసుకొని జనసేన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొంది. 2018 జనవరి నుండి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల్లోకి వెళ్ళే యోచన చేస్తున్నారు. అంతేకాదు ఈ మేరకు తన చేతిలో ఉన్న సినిమాలను త్వరలో పూర్తి చేసి పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం కేటాయించనున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవలనే ప్రకటించారు.

అనంతపురంలో పవన్ పోటీతో టిడిపికి దెబ్బెనా
అనంతపురం జిల్లాలో టిడిపికి మొదటి నుండి బిసిలు అండగా నిలుస్తున్నారు. ఇదే జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బిసి ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు.. అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకొనే నిర్ణయాల ఆధారంగా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అయితే అదే సమయంలో బిసిలతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు జెసి సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడే ఈ విషయాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications