Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan : ముందస్తు ఎన్నికలపై పవన్ మరో హింట్ ! సీట్లకు డబ్బుల వసూలుపైనా !

ఏపీలో వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు కాస్తా ముందుకు జరగబోతున్నాయంటూ గతంలో వెల్లడించి కలకలం రేపిన జనసేనాని పవన్ కళ్యాణ్ .. ఇవాళ మరోసారి అదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న పవన్.. ఈ మేరకు ముందస్తు ఎన్నికలపైనా క్యాడర్ కు మరోసారి హింట్ ఇచ్చారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ పలు అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల దిశగా వారిని సమాయత్తం కావాలని కోరారు. అదే సమయంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని వారితో వ్యాఖ్యానించారు. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపా దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే అన్నారు. ఎన్నికల ఏడాదిలో అడుగుపెడుతున్నామని, రాష్ట్రంలో తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

pawankalyan

జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కేవలం తన చుట్టూ తిరిగితే నాయకులైపోరంటూ నేతలకు చురకలు అంటించారు. డబ్బు ఇచ్చి సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదని, వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలన్నారు. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తానని పవన్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అనే ఒక దుష్ట నాయకుడిపై మనం పోరాడాలంటూ వారికి సూచించారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయమే తన ఇల్లని పవన్ తెలిపారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారిని ఓటర్లుగా మార్చుకోవాలని పవన్ నేతలకు సూచించారు. 2019 ఎన్నికల తరహాలో కాకుండా సర్వే నివేదికలు, అభిప్రాయ సేకరణ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని నేతలకు తెలిపారు. అలాగే ప్రత్యర్ధులు రెచ్చగొట్టారని మీరు రెచ్చిపోవద్దని నేతలకు పవన్ సూచించారు. జనసేనకు భాష ముఖ్యమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+