విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్

ఉద్ధానం సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఏపీ రాజధానిలో ఇదే తన తొలి ప్రెస్ మీట్ అని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఉద్ధానం సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఏపీ రాజధానిలో ఇదే తన తొలి ప్రెస్ మీట్ అని చెప్పారు.

బాబుతో భేటీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్: ఫ్లెక్సీ చించివేత, ఫ్యాన్స్ ఆగ్రహంబాబుతో భేటీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్: ఫ్లెక్సీ చించివేత, ఫ్యాన్స్ ఆగ్రహం

ఉద్ధానం సమస్యపై చాలామంది స్పందించారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉద్ధానం సమస్యను చూడాలని విజ్ఞప్తి చేశారు. తన కటౌట్లను చించివేసినా తాను బాధపడలేదని, పట్టించుకోలేదని పవన్ చెప్పారు.

విశాఖలో అభిమానుల ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు, ఐనా సంతోషమే!విశాఖలో అభిమానుల ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు, ఐనా సంతోషమే!

చంద్రబాబు సానుకూలం

చంద్రబాబు సానుకూలం

ఉద్ధానం సమస్యను తన ముందుకు మీడియా ఎలాగైతే ముందుకు తీసుకు వచ్చిందో, ఇప్పుడు తాను కూడా అలాగే ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు. ఉద్ధానం సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. చిన్నారుల దత్తతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు.

Recommended Video

Pawan Kalyan meets Chandrababu Naidu, Fans Bike rally
నా వంతు సహకారం

నా వంతు సహకారం

ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉద్దానం సమస్యను రాజకీయం చేయదల్చుకోలేదన్నారు. మనుషులు చనిపోతున్నప్పుడు దానితో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దిగజారుడుతనమన్నారు.

మనుషుల్ని కలిపే రాజకీయం కావాలి

మనుషుల్ని కలిపే రాజకీయం కావాలి

మానవతా కోణంలోనే మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులను కలిపే గొప్ప రాజకీయ విధానం కావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేసి కాస్త ఉపశమనం కలిగేలా చేశారని చెప్పారు. ఉద్ధానంలో దశాబ్దాలుగా సమస్య ఉందన్నారు.

డాక్టర్లు బాగా పని చేస్తున్నారు

డాక్టర్లు బాగా పని చేస్తున్నారు

ఉద్దానం సమస్యపై హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బాగా స్పందించారన్నారు. రీసెర్చ్ సెంటర్ పెడితే సహకరిస్తామని చెప్పారన్నారు. డయాలసిస్ సెంటర్‌లతోనే ఆపకుండా ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు.

జనసేన కృషి

జనసేన కృషి

ఉద్ధానంలో అనాథ పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రత గుర్తించే సరికి పరిస్థితి చేయి దాటిపోతోందన్నారు. జనసేన తరఫున కిడ్నీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తాను చంద్రబాబుతో భేటీ సందర్భంగా జీఎస్టీ గురించి కూడా అడిగానని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Monday talk with media on Uddanam issue after meeting with AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X