వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను అలా చేసి ఉంటే: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్ కౌంటర్, బాబుకు 'అవినీతి' షాక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan strong words over Modi Lok Sabha speech

హైదరాబాద్/అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం, ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ హామీలపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, లోకసభలో ప్రధాని మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు మినహా విభజన హామీల ప్రస్తావన లేవు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు.

తొలుత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ మృతికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై తీవ్రంగా స్పందించారు. విభజన సమయంలో యూపీఏ ఏపీకి న్యాయం చేయలేదని, ఈ విషయాన్ని తాను ప్రధాని మోడీకి అప్పుడు వివరించానని చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేయాలని మోడీని 2014 ఎన్నికలకు ముందు కోరాని చెప్పారు.

'పవన్ కళ్యాణ్! పిచ్చి వేషాలు మానుకో, లేదంటే': జనసేనానికి తీవ్ర హెచ్చరిక'పవన్ కళ్యాణ్! పిచ్చి వేషాలు మానుకో, లేదంటే': జనసేనానికి తీవ్ర హెచ్చరిక

విభజనపై మరోసారి పవన్ కళ్యాణ్

విభజనపై మరోసారి పవన్ కళ్యాణ్

బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదన్నారు. యూపీఏ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని చెప్పారు. ఇదే విషయాన్ని నాడు మోడీకి చెప్పి, మీరు న్యాయం చేయాలని కోరానని తెలిపారు.

సాకులు చెప్పి హోదాను ప్యాకేజీగా మార్చారు

సాకులు చెప్పి హోదాను ప్యాకేజీగా మార్చారు

ఏపీకి అండగా ఉంటారనే ఎన్నికలకు ముందు మోడీతో కలిశానని చెప్పారు. హామీలపై తాను తొలి ఏడాది సంయమనం పాటించానని చెప్పారు. వివిధ సాకులతో ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చారని మండిపడ్డారు.

టీడీపీ పైనా నమ్మకం పోతోంది, అవినీతి అంటు బాబుకు షాక్

టీడీపీ పైనా నమ్మకం పోతోంది, అవినీతి అంటు బాబుకు షాక్

ఏపీ పరిస్థితి చూస్తుంటే బీజేపీపై నమ్మకం పోతోందన్నారు. టీడీపీ పైనా నమ్మకం పోతోందన్నారు. ఏపీలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని సర్వేలు చెబుతున్నాయని అంటూ చంద్రబాబుకు షాకిచ్చారు. ప్రత్యేక హోదాను ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైసీపీ తీరును కూడా పవన్ తప్పుబట్టారు. ఏపీకి న్యాయం జరిగేందుకు ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటై పోరాటం చేయాలన్నారు. అందరు ఓ ప్లాట్ ఫాం పైకి వచ్చి పోరాడితే బాగుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారు.

పోటీ చేయకపోవడంపై బాధపడుతున్నా

పోటీ చేయకపోవడంపై బాధపడుతున్నా


2014 ఎన్నికల సమయంలో నేను పోటీ చేసి ఉంటే ఈ రోజు బలమైన గొంతు తనకు ఉంటి ప్రజల పక్షాన తన వాణి వినిపించేవాడినేమో అని పవన్ అన్నారు. ఇటు శాసన సభలో, అటు పార్లమెంటులో సీట్లు గెలిచి ఏపీ కోసం గట్టిగా నిలదీసేవాడిని అన్నారు. ఈ విషయంలో (నాడు తాను పోటీ చేయకపోవడంపై) బాధపడుతున్నానని చెప్పారు.

వారితో కలిసి ఉద్యమిస్తా, తెలంగాణవారు కలిశారు

వారితో కలిసి ఉద్యమిస్తా, తెలంగాణవారు కలిశారు


ప్రత్యేక హోదా కోసం పోరాడే వారితో కలిసి తాము ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో కలిసి హోదా కోసం ముందుకు సాగుతామన్నారు. నాడు తెలంగాణ కోసం అందరూ కలిసి సభలను స్తంభింప చేశారన్నారు. ఏపీకి హామీల విషయంలో అలా కలిసి పోవడం లేదన్నారు. ప్లకార్డులతో పనులు జరగవన్నారు.

జేఏసీ ఏర్పాటు చేస్తా, ప్యాకేజీపై గందరగోళం

జేఏసీ ఏర్పాటు చేస్తా, ప్యాకేజీపై గందరగోళం

రూలింగ్ పార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా కోసం జేఏసీ ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దాము జేఏసీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శాంతియుత ధర్నాలకు జనసేన మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై గందరగోళం ఉందని, పలువురు రకరకాలు చెబుతున్నారన్నారు. హోదా కోసం రాజకీయ పోరాటం కావాలన్నారు.

మనల్ని మనమే కొట్టుకున్నట్లు, మోడీ మాట్లాడారు కానీ

మనల్ని మనమే కొట్టుకున్నట్లు, మోడీ మాట్లాడారు కానీ

ఏపీ బంద్ అంటూ ఇలా బందులు చేస్తే మనలను మనమే కొట్టుకున్నట్లు అని పవన్ అన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేశాయని, కానీ ఏపీలో మాత్రం హోదా కోసం అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డిల గురించి మాట్లాడిన మోడీ ఏపీ సమస్యలను పట్టించుకోలేదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan responded on Prime Minister Narendra Modi's Lok Sabha speech and Chandrababu Naidu government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X