వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! సమాధానం చెప్పండి: టిటిడిపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఆయన సోమవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఆయన సోమవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు.

<strong>టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తా: చంద్రబాబుపై స్వరూపానంద ఆగ్రహం </strong>టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తా: చంద్రబాబుపై స్వరూపానంద ఆగ్రహం

టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉత్తరాది ఐఏఎస్‌కు తాను వ్యతిరేకం కాదని చెప్పారు.

అమర్నాథ్, వారణాసీల మాటేమిటి?

అయితే, అమర్నాథ్, మధుర, వారణాసిలాంటి పవిత్ర ప్రాంతాలలో దక్షిణాది ఐఏఎస్‌లకు బాధ్యతలను ఎందుకు అప్పగించరని జనసేన అధినేత ప్రశ్నించారు. ఉత్తరాది వ్యక్తిని ఈవోగా నియమించిన టిడిపి ప్రభుత్వం నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ఉత్తరాది వ్యక్తిని ఎలా నియమిస్తారు?

ఉత్తరాది వ్యక్తిని ఎలా నియమిస్తారు?

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతారని చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాష్ట్రానికి ఉత్తరాదికి చెందిన అధికారిని ఈవోగా తీసుకురావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం

టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం

రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కన పెట్టి ఉత్తరాధి అధికారిని టిటిడి ఈవోగా ఎలా నియమిస్తారని చంద్రబాబును నిలదీస్తున్నారు. టిటిడి ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్తామని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.

ఇవీ ఆరోపణలు

ఇవీ ఆరోపణలు

తెలుగు చదవడం రాని వారిని టిటిడి ఈవోగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టిటిడి ఆగమాలపై అవగాహన లేనందువల్ల కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అనేక సమస్యలు వస్తాయంటున్నారు. ఉత్తరాది ప్రాంతంలో ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Monday questioned Nara Chandrababu Naidu government over TTD EO issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X