పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అవసరం మేరకు కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.

ఉపాధి హామీ కూలీల కోసం పవన్ కళ్యాణ్ శుభవార్తలు
కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్రం అంగీకరించిందన్నారు.

pawan kalyan request to modi Center sanctioned funds for employment guarantee workers wages

ఉపాధి హామీ కూలీల వేతనాలు మంజూరు చేసిన కేంద్రం
ఇక తాజాగా మరో శుభవార్త చెప్పారు పవన్ కళ్యాణ్. తన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటి వరకు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.50 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఉపాధి హామీ పనులకు అదనంగా రూ.2812.98 కోట్ల మంజూరు
అంతేకాదు గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయన్నారు.

పవన్ విజ్ఞప్తితో నిదులిచ్చిన కేంద్రం
మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. మోడీకి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధుల సత్వర విడుదలకు చేసిన విజ్ఞప్తితో కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది. దీంతో ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన డబ్బులు అందటమే కాకుండా వారికి పని దినాలు కూడా పెరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+