వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ ఎవరిని ఎలా తిట్టారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన రాజకీయ పార్టీ జనసేన ప్రారంభ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై పంచ్ డైలాగ్‌లు విసిరారు. రాజకీయ వ్యవస్థపై, రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూనే కొంత మంది రాజకీయ నాయకులను ఎంపిక చేసుకుని తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇలా సాగాయి.

Pawan Kalyan retaliates political leaders

కాపులను నేను అడిగానా?

కాపులు నన్ను ఒప్పుకోవడం లేదట! నన్ను ఒప్పుకోవడానికి మీరెవరు? నన్ను బలపరచాలని నేను అడిగానా? కాపు నాయకులు అలా అంటే భయపడతానా? నాకు కులం, మతం, ప్రాంతం లేదు. నేను భారతీయుడిని.

వెంకయ్య నాయుడిపై..

రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సీమాంధ్ర కోసం వెంకయ్యనాయుడు పడిన పాట్లు చూశాను. నిజంగా ఆయన నాకు నచ్చారు. రాష్ట్రం విడిపోతోంది, రాజధాని లేదు, కొన్ని ఎక్కువ డబ్బులొస్తే బాగుంటుందని ఆయన పడుతున్న తపన నాకు నచ్చింది. నేను ఇలా ఆయన గురించి గొప్పగా అనుకుంటే... నా గురించి ఆయన ఏమన్నారో తెలుసా? 'పవన్ కల్యాణ్ పార్టీ పెడతాడట! ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేమిటి?' అన్నారు. వెంకయ్య అంటే నాకు ఎంతో గౌరవం. మీరంతా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మరి... పార్లమెంటులో ఎంత అసహ్యంగా చేశారు? ఎంతో గౌరవంగా తీసుకురావాల్సిన మన తెలంగాణను, ఎలా తీసుకొచ్చారో చూశాం! మరి... దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఎవరో ఆలోచించుకోండి! నా గురించి అనొద్దు!

జగ్గారెడ్డి బాగా నచ్చాడు..

తెలంగాణ వాదుల్లో నాకు బాగా నచ్చింది జగ్గారెడ్డి. నిజంగా అలాంటి వ్యక్తి ఉద్యమాన్ని నడిపి ఉంటే, ఈ రోజు మనం మిఠాయిలు పంచుకుంటూ విడిపోయేవాళ్లం.

విహెచ్ గురించి ఇలా..

కాంగ్రెసు నాయకుడు విహెచ్ అన్నా నాకు ఇష్టం. వెటకారం.. కాదు. నిజంగా ఇష్టం. అయితే, ఆయన నా గురించి ఏమన్నారో తెలుసా! 'అరె.. పవన్ మూడుపెళ్లిళ్లు చేసుకున్నడుబై! రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తడు! మా రాహుల్‌గాంధీ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు'' అని అన్నారు. అయితే... రాహుల్ పెళ్లి చేసుకోలేదన్నారుకానీ, ఆయన బ్రహ్మచారి అని చెప్పలేదు. వీహెచ్ గారూ.. నాకో సందేహం! ఒకే ఒక్క పెళ్లి చేసుకుని, ఎవరికీ తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? ఢిల్లీ స్థాయిలో అలా తిరిగే మీ మిత్రులు చాలామంది తెలుసు కదా! నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే, కాంగ్రెస్ అబ్బాయి రాహుల్, అల్లుడు రాబర్ట్‌ వాదజ్రా వ్యక్తిగత జీవితాలు కూడా తీస్తా! ఏ రంగం వారైనా సరే... నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే, వారి చరిత్రలు బయటికి తీస్తా! ఇద్దరు ప్రేమికులు, ఇద్దరు దంపతులు, ఒక కుటుంబం మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. మీకు తెలియని విషయాలను బయటి నుంచి చూసి విమర్శించకండి! నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. వారు ఆడపిల్లలు... వారికీజీవితాలుంటాయి, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకోవచ్చు. వారిని అవమానించడం సంస్కారమా? ఇది మానసిక అత్యాచారమే! దీనికీ నిర్భయ కింద కేసు పెట్టాలి.

కవితా..లెక్క చెప్పండి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత... ఆమె కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి కూతురు. ఆమె ఏమన్నారంటే... "పవన్ కల్యాణ్... భారతదేశ పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కుంది. కానీ, నీ పార్టీ విధి విధానాలు చెప్పబోయే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు!'' అని! నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు, నన్ను అభిమానించే తెలంగాణ ప్రజలకు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి! అమ్మా.. కవితా! నువ్వు నాకు చెల్లెలిలాంటి దానివి. ఒక అన్నయ్యగా నీ బాధ అర్థం చేసుకోగలను. మీ అసలు అన్నయ్య కెటిఆర్ ఆవేశాన్ని కూడా అర్థం చేసుకోగలను! అయితే, తెలంగాణ జాగృతి గురించి తెలంగాణకే చెందిన ఓ ప్రజా సంఘాల ప్రతినిధి చాలా చెప్పారు. అమెరికాలో ఉండే మిత్రులు కూడా డబ్బు పంపించామని చెప్పారు. ఆ డబ్బులు ఏం చేశారు? ఎలా ఖర్చు పెట్టారు? ఉద్యమ సమయంలో ఎవరెవరికి వెళ్లాయి? భవిష్యత్తులో ఏం చేస్తారనే విషయం... నాకు కాదు, ప్రజా సంఘాల వారికి చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల, నన్ను తిట్టే పని పెట్టుకోవద్దు తల్లీ! మీ నాన్న, అన్నయ్య, మామయ్య, మీరు తీసుకున్న డబ్బుకు లెక్కలు చూపే పనిలో ఉండండి!

కెసిఆర్ గురించి ఇలా...

సంక్రాంతి గంగిరెద్దుల్లా కొత్త పార్టీలు వస్తున్నాయి, నమ్మొద్దు అని కెసిఆర్ చెప్పారు. నేను చెప్పేది వినే.. అంటూ కెసిఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

English summary
Pawan Kalyan has retaliated Congress and Telangana rastra samithi (TRS) leaders comments made against him 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X