నాకు సలహాలిచ్చి.. ఇప్పుడు.. ముద్రగడ, జోగయ్యపై పవన్ కామెంట్స్ !

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కలిపేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్.. టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకోవడమ కాక బీజేపీని కూడా ఇందులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పొత్తుల్ని ఫైనల్ చేసుకునేందుకు ఇవాళ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో చర్చలు కూడా జరపబోతున్నారు. ఈ తరుణంలో తనకు నిత్యం లేఖలు రాస్తూ, సలహాల పేరుతో రచ్చ చేస్తున్న కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యపై సెటైర్లు వేశారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన జనసే అధినేత పవన్.. తనకు సలహాలు ఇస్తున్న ముద్రగడ, హరిరామ జోగయ్యపై వారి పేర్లు ఎత్తకుండానే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా నాకు అలా చేయ్, ఇలా చేయ్ అని చాలా మంది సలహాలు ఇచ్చారని పవన్ గుర్తుచేశారు. నాకు సీట్లు తీసుకోవడం, ఇవ్వడం తెలియదా? నాకు సలహాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

pawan kalyan retard to kapu leaders mudragada padmanabham and harirama jogaiah

అలాగే కాపు రిజర్వేషన్ల గురించి కూడా వీరిద్దరూ గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ.. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పటికే తనకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని, చేతనైతే కలిసి నడవాలని టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగసభ వేదికపై నుంచే పవన్ కళ్యాణ్ వీరిద్దరికీ తేల్చిచెప్పేశారు. ఆ తర్వాత హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోవడం, ఇప్పుడు ముద్రగడ కూడా తనయుడితో కలిసి అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటంతో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+