టెక్నాలజీతో 'అజ్ఞాతవాసి'పై అభిమానం: నెల్లూరులో పవన్ ఫ్యాన్స్ గొడవకు డీఎస్పీ చెక్!

Posted By:
Subscribe to Oneindia Telugu
టెక్నాలజీతో 'అజ్ఞాతవాసి'పై అభిమానం, కానీ ?

నెల్లూరు/అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. పవన్ పైన అభిమానులు తమకు తోచిన విధంగా అభిమానం ప్రదర్శిస్తున్నారు.

చదవండి: సీఎంలకు 'అజ్ఞాతవాసి' షాక్: డిఫెన్స్‌లో పడ్డారా? పవన్ కళ్యాణ్ రాయబారం, ట్విస్ట్

సినిమా విడుదల నేపథ్యంలో బుధవారం ప్రతి థియేటర్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. ఫ్యాన్స్ హంగామా చేశారు. థియేటర్ల వద్ద కాకుండా అభిమానులు వివిధ రకాలుగా అభిమానం ప్రదర్శించారు. హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్ చిన్నప్పటి నుంచి పవన్‌కు వీరాభిమాని.

పట్టు చీర అంచుపైన అజ్ఞాతవాసి

పట్టు చీర అంచుపైన అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి బుధవారం విడుదల నేపథ్యంలో ఆ సినిమాలో పవన్ గిటారు వాయిస్తున్న చిత్రాన్ని తన సృజనతో పట్టుచీర అంచులపై వేశారు. కంప్యూటర్ జాకార్డును ధర్మవరంలో డిజైన్ చేయించి, ముద్దిరెడ్డిపల్లిలోని తన మరమగ్గాల్లో పూర్తి పట్టుతో రెండు రోజుల పాటు శ్రమించి చేశారు.

చీర తయారీకి 15 రోజుల సమయం, రూ.25వేల ఖర్చు

చీర తయారీకి 15 రోజుల సమయం, రూ.25వేల ఖర్చు

ఈ డిజైన్‌ను రూపొందించడానికి సుమారు 15 రోజుల సమయం పట్టిందని చెప్పారు. చీర తయారికు రూ.25వేలు ఖర్చు అయినట్లు తెలిపారు. పవన్ పైన ఉన్న అభిమానంతో ఈ చీరను తయారు చేశానని, దీనిని అతనికి బహుమతిగా ఇస్తానని చెప్పారు. తాను ఒక చీర మాత్రమే తయారు చేశానని, కానీ సమాచారం తెలుసుకున్న చాలామంది చీరలు కావాలని ఆర్డర్లు ఇస్తున్నారని చెప్పారు.

 ఆధునిక సాంకేతికతను వినియోగించి

ఆధునిక సాంకేతికతను వినియోగించి

పవన్ కళ్యాణ్ పైన తనదైన శైలిలో అభిమానం చూపించిన ఆనంద్ పదో తరగతి చదివారు. పట్టుచీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ చీరను నేసినట్లు చెప్పారు.

 పవన్ అభిమానుల ఆందోళనకు డీఎస్పీ పరిష్కారం

పవన్ అభిమానుల ఆందోళనకు డీఎస్పీ పరిష్కారం

మరోవైపు, పవన్‌ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం టిక్కెట్ల గొడవ నెల్లూరు జిల్లాలో మంగళవారం ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి అలజడి సృష్టించిన ఈ వివాదం నగర డీఎస్పీ మురళీకృష్ణ చొరవతో సద్దుమణిగింది. ఉదయం నుంచే పవన్‌ అభిమాన సంఘాలు, చిరంజీవి యువత నాయకులు పెద్ద ఎత్తున డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ వచ్చి వారితో చర్చించిన అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

 బ్లాక్ టిక్కెట్లపై చర్చ

బ్లాక్ టిక్కెట్లపై చర్చ

సినిమా విడుదల నేపథ్యంలో పలువురు అభిమానులు నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. అభిమాన సంఘాల పేరుతో టిక్కెట్లు తీసుకొని బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ టిక్కెట్లపై చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీకి సూచించారు. దీంతో సోమవారం రాత్రి నగర డీఎస్పీ తన కార్యాలయంలో అన్ని స్టేషన్ల సీఐలు, థియేటర్ల యజమానులతో సమావేశమయ్యారు. టిక్కెట్ల విషయంపై చర్చించారు. అనంత]రం మంగళవారం మరోసారి డీఎస్పీ వారితో సమావేశమయ్యారు.

తొలి ప్రదర్శన అభిమానులకు

తొలి ప్రదర్శన అభిమానులకు

థియేటర్లలో ఉన్న సీటీంగ్‌ల సామర్ధ్యం అడిగి తెలుసుకున్నారు. సీటింగ్‌ కెపాసిటీ ఆధారంగా సగం టిక్కెట్లు అభిమాన సంఘాలకు, మిగతా సగం థియేటర్ల క్యూలో, ఆన్‌లైన్‌లో అమ్మాలని సూచించారు. దీనికి థియేటర్ యాజమాన్యాలు అంగీకరించాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చిత్రం తొలి ప్రదర్శన మొత్తం అభిమానులకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అభిమాన సంఘాలు టిక్కెట్లు అభిమానులకు పంచి ఇవ్వాలని, వారి పేర్లన్నింటిని థియేటర్ యాజమాన్యాలకు ఇవ్వాలని నగర డీఎస్పీ సూచించారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మకుండా చూడాలన్నారు. ఎక్కడైనా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan's Agnyaathavaasi still on silk saree from Hindupur weaver.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి