విశాఖను మీరు రాజధాని చేయడమేంట్రా బాబూ.. దేశానికి రెండో రాజధాని- నాగబాబు ట్వీట్
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయంలో ఇవాళ మరో టర్నింగ్ పాయింట్ ఎదురైంది. విశాఖలో మూడు రాజధానుల కోసం నాన్ పొలిటికల్ జేఏసీ సాయంతో వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జనపై అమరావతిని సమర్ధిస్తున్న విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన నేతలు కూడా రెచ్చిపోతున్నారు.
Vizag ని మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు . Vizag already రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ.
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 15, 2022
వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి .#YCPisINJURIOUStoAPenvironment
save వైజాగ్ from environment destroyers.
విశాఖలో వైసీపీ గర్జనపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పీఏసీ నేత కూడా అయిన నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. విశాఖను రాజధాని చేస్తామంటున్న వైసీపీ నేతల్ని ఉద్దేశించి నాగబాబు పెట్టిన ఈ ట్వీట్ లో దేశానికి రెండో రాజధాని ప్రస్తావన కూడా చేశారు. దీంతో ఇప్పుడు నాగబాబు ట్వీట్ వైరల్ అవుతోంది. నాగబాబు రియాక్షన్ వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. విశాఖ గర్జన ద్వారా మూడు రాజధానుల వాదన బలంగా వినిపించామని వైసీపీ నేతలు భావిస్తున్న తరుణంలో నాగబాబు పెట్టిన ఈ ట్వీట్ వారిని షాక్ కొట్టించేలా ఉంది.

తన ట్వీట్ లో నాగబాబు Vizag ని మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు . Vizag already రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విశాఖను రాజధాని చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ఇవాళ ఉదయం గర్జన సందర్భంగా పవన్ కళ్యాణ్ ను బాయ్ కాట్ చేయాలని, నిలదీయాలని పిలుపునిచ్చారు. దీనిపై స్పందించి నాగబాబు ఈ ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications