దూరంగా: పవన్ కళ్యాణ్ కొత్త పోకడ: సోషల్ ఆర్మీ దిశగా

హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ ప్రకటనలో తన మార్కుని చాటిన పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం నుంచి విధానం దాకా ప్రతి ఆలోచనలోనూ అదే ఊపుని కొనసాగిస్తున్నారు. మతపరమైన, సాంస్కృతిక సంబంధ వేడుకలకు, జయంతులకు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, తెలుగు జాతి సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడే జూన్ 2వ తేదీలను మాత్రమే పార్టీ పండుగలుగా జరుపుకోనున్నట్టు జనసేన పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తమని తాము జాతీయ వాదులుగా ప్రకటించుకున్నాయి.

Pawan Kalyan's Jana Sena makes 'policy declaration'

కొత్త తరంతో సరికొత్త రాజకీయాలకు తెర తీసేందుకువీలుగా సోషల్ ఆర్మీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాయి. ఆ మేరకు విధాన ప్రకటనని విడుదల చేశాయి. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే తమ పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసమే పోరాటం చేస్తుందని వెల్లడించాయి.

ప్రముఖుల జయంతి వేడుకలను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటున్నారు. అలాగే భిన్నమతాలు, సంస్కృతుల సమ్మేళనం అయిన భారతజాతి స్ఫూర్తిని నిలబెట్టేందుకు, మతపరమైన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివరించాయి.

ఒక కొత్త రకం నాయకులతో కూడిన ఒక వినూత్న రాజకీయ శక్తిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని, తద్వారా అట్టడుగు స్థాయి నుంచి సమాజంలో ఒక విప్లవాన్ని తీసుకరావ డానికి ప్రయత్నిస్తున్నారని తెలిపాయి. ఇందులో భాగంగా సోషల్ ఆర్మీని నిర్మిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పటికే సభ్యత్వం తీసుకున్నారని అయితే, ఈ ఆర్మీలో సభ్యత్వాన్ని కోరుకునేవారి పూర్వాపరాల్ని జాగ్రత్తగా పరిశీలించి కఠోరమైన శిక్షణ ఇస్తామని తెలిపాయి. ఈ విషయాన్ని విధాన ప్రకటనలో పేర్కొన్నట్లు వెల్లడించాయి. తాత్కాలిక ప్రయోజనాలు, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల్ని సాధించే సామాజిక, రాజకీయ లక్ష్యాలను విధాన పత్రంలో పొందుపరిచినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+