ఏపీ, తెలంగాణా రాజకీయాలకు తేడా చెప్పిన పవన్ కళ్యాణ్!!
ఏపీ, తెలంగాణా రాజకీయాలకు తేడా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు భావోద్వేగంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తనను ఎవరు ఆదరించకపోయినా, గత ఎన్నికలలో ఓటమిని అందించినా ఏపీ ప్రజల కోసం తాను పదేళ్ల నుండి తనవంతుగా కృషి చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల పొత్తుపై తేల్చి చెప్పారు. ఈసారి బలి పశువును కానని, గతానికి భిన్నంగా అనేక ఆసక్తికర అంశాలను మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ, తెలంగాణా రాజకీయాల్లో వ్యత్యాసం ఇదే
ఇక ఇదే సమయంలో తాను తెలంగాణ రాష్ట్రంలో ఇదే పని చేస్తే అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకునే వారిని, ఇప్పటికీ తనను ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు వెళ్లారని చాలామంది తెలంగాణ ప్రాంత అభిమానులు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు మధ్య వ్యత్యాసం చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలలో అన్ని కులాల వారు ఉన్నప్పటికీ వారందరికీ ఉమ్మడి నినాదం తెలంగాణ అని స్పష్టం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఆ విధంగా లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఉమ్మడి నినాదం లేదని, కులాలకే ప్రాధాన్యతనిస్తూ ప్రజలు రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాని చేస్తుందని పవన్ కళ్యాణ్ వాపోయారు.

ఏపీలో చేసిన రాజకీయం తెలంగాణాలో చేస్తే సక్సెస్ అయ్యే వాడిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది ఏళ్ళుగా తాను చేస్తున్న పోరాటం, చేస్తున్న రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో చేస్తే ఎప్పుడో సక్సెస్ అయ్యే వాడిని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను ఒక సినిమా తీస్తే 45 కోట్లు తీసుకుంటానని, 20, 25 రోజుల్లో సినిమా పని పూర్తి చేస్తానని, రోజుకు రెండు కోట్ల చొప్పున సంపాదిస్తానని పేర్కొన్న పవన్ కళ్యాణ్, తాను సంపాదించిన డబ్బంతా రాజకీయాల కోసమే ఖర్చు చేస్తున్నట్టుగా తెలిపారు. తనను ఆదరిస్తారు అనుకున్న ప్రజలు గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నా ఎందుకు ఆదరించటం లేదో తనకు అర్థం కావడం లేదని పవన్ కళ్యాణ్ వాపోయారు.

కులాల వారీగా రాష్ట్రంలో ప్రజలను విడదీసిన ప్రభుత్వం .. పవన్ కళ్యాణ్ నిప్పులు
ఓటుకి డబ్బు ఇచ్చి కొనుక్కునే సంస్కృతి తమ పార్టీకి లేదని, తనకు ఓటు ప్రాధాన్యం కాదని, తనమీద నమ్మకం చూపిస్తే చాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాలవారీగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్రంలోని అన్ని కులాలను కలిపేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. జనసేన ఉంది సమాజంలో పరివర్తన తీసుకురావడానికి అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఏదో ఒక కులాన్ని గద్దెనెక్కించడం కోసం తాను పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించారు.

కులాల కుంపటిపై పవన్ ఫోకస్
అన్ని కులాలు పాలనలో భాగస్వామ్యం తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క కుల పెత్తనం ఆగిపోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉన్న తేడా ఈ కులాల కుంపట్లేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా కులచట్రం నుండి ప్రజలు బయటకు రావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.అప్పుడే రాష్ట్రం కోసం ఏమైనా చెయ్యగలుగుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!












Click it and Unblock the Notifications