టీడీపీకి కొమ్ము కాయను - మూడో ప్రత్యామ్నాయం కావాలి : మోదీ చెప్పారు -పవన్ సంచలనం..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీకి కొమ్ము కాయనని తేల్చి చెప్పారు. కేంద్రం - రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేసారు. తాను కులంను గౌరవిస్తాను కానీ, పిచ్చి లేదని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం ఉండి ఉంటే మూడో ప్రత్యామ్నాయంగా ఉండేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యంలో నాడు ఉంటూ వైఎస్సార్ కోవర్టులుగా పని చేసిన వారు నేడు మంత్రులుగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం పైన నిర్ణయం తీసుకోలేదని...ఇంత విధ్వంస రాజకీయం జరుగుతున్న సమయంలో.. ప్రత్యర్ధులతో కూడా కలుస్తామని..అదే రాజకీయమని తేల్చి చెప్పారు. కుప్పంలో కూడా మా వాళ్లను జెండాలు కట్టనీయటం లేదని చెప్పుకొచ్చారు. తాను మార్పు కోసమే నిలబడి ఉంటానని.. భయపడేది లేదని పవన్ స్పష్టం చేసారు. ఆస్తులు కోసం భయపడనని..కావాలంటే ఉన్నవి కూడా తీసేసుకోండంటూ సవాల్ చేసారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్క మెగా ఫ్యామిలీది కాదని.. ఒక్క కులానిది కాదని..అందరిదీ అని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తీసేసిన తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తన పైన ఒత్తిడి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

నాడు మోదీ చెబితేనే టీడీపీతో కలిసా

నాడు మోదీ చెబితేనే టీడీపీతో కలిసా

తాను 2014లో మోదీని కలిసిన సమయంలో..తాము టీడీపీతో కలిసి వెళ్తున్నామని.. మద్దతు ఇవ్వాలని చెప్పటంతోనే తాను టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ వెల్లడించారు. మురళీ టు మెగాస్టార్ వరకు చేతులు కట్టుకొని ఉండాలంటే..ఆధిపత్య ధోరణి తో వ్యవహరిస్తామంటే కదురదని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు కూడా మా కార్యాలయానికి వచ్చి పొత్తుల గురించి మాట్లాడాలని స్పష్టం చేసానని..అప్పుడే ఆయనతో మాట్లాడనని పవన్ వెల్లడించారు. నాడు రాజకీయాలకు కొత్త వాడినే కానీ.. మనస్తత్వాలు మాత్రం తెలిసిన వాడినని నాడే చంద్రబాబుకు చెప్పానని వివరించారు. నవ రత్నాల పేరుతో ప్రజలకు కీడు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వెనుకబడిన వర్గాలకు నిజమైన రాజకీయ అధికారం రావాలనేది తన లక్ష్యమని స్పష్టం చేసారు. జనసేన ఒక వర్గం ఓట్లు అమ్మేస్తామని వైసీపీ ఆరోపిస్తోందని..తాను అటువంటి పనులు చేయనని చెప్పారు. తన వ్యూహం ఏంటో చెప్పనని.. వైసీపీ రాకూడనదే తన లక్ష్యం అన్నారు.

ప్రత్యర్ధులతోనూ కలవటమే రాజకీయం

ప్రత్యర్ధులతోనూ కలవటమే రాజకీయం

వైసీపీ సమర్ధవంతం గా పాలన చేస్తే అభినందిస్తామని వివరించారు. డబ్బు - అధికారం ఉంటే ఎక్కడైనా మడిచి పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎవరైనా ఆత్మగౌరవాన్నే కోరుకుంటారని.. నీ ఇంటికి ఎవరైనా వస్తే నడుచుకుంటూనే లోపలకు రావాలనుకోవటం ఆధిపత్య ధోరణిగా పేర్కొన్నారు, ఎవరైనా తనతో మైత్రి కావాలంటే.. తన వాళ్లందరికీ గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసారు. సీమలో ఎవరూ భయపడి చేతులు కట్టుకోవద్దని పవన్ సూచించారు. రాష్ట్రంలో గనులు..అడువులను కొల్ల గొడుతున్నారని పవన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్ కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+