బిజెపికి సమయం వచ్చింది: ఎపికి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయరంగంలో అకస్మాత్తుగా కలకలం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే విషయంలో బిజెపి మాట తప్పదనే తాను అనుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Pawan Kalyan says on special status:

ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై బిజెపి మాటల నిలబెట్టుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు. నిరుడు రాష్ట్ర విభజన బిల్లుకు అస్తవ్యస్తమైన రీతిలో కాంగ్రెసు పార్లమెంటులో ఆమోదం పొందిందని, దానికి బిజెపి కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని బిజెపి కూడా హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. ఆ మాట మీద నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

ప్రజలు బిజెపిని విశ్వసించారని, బిజెపికి మద్దతు ఇచ్చారని, ఆ ప్రజల ఆకాంక్షలను మరిచిపోదని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు పార్టీ ఆందోళనలకు దిగుతోంది. సోమవారంనాడు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పిస్తుందా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

ప్రత్యేక హోదా కల్పనపై కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో తెలుగదుేసం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగారు. విభజన బిల్లులో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇది వరకే లేఖ రాశారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తాము అంటే పదేళ్లు కావాలని పట్టుబట్టారు కదా అని బిజెపిని ఎత్తిపొడిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+