2024లో ప్రజాప్రభుత్వం: అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, 10లక్షల ఆర్ధికసాయం: పవన్ కళ్యాణ్ సంచలనాలు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రశ్నించే వ్యక్తుల పై వైసీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు, దుర్భాషలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2024 లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన అధికారంలోకి వస్తే యువతకు 10 లక్షల ఆర్ధిక సాయం
నూతన పారిశ్రామిక పాలసీ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేద్దామని, యువత ఆర్థిక స్వావలంబన సాధించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువత స్వయం ఉపాధి సాధించుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని పవన్ కళ్యాణ్ సభా వేదికగా వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్న పవన్ కళ్యాణ్, తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ,రైతులకు మద్దతు ధర ఇప్పించడానికి కృషి చేస్తామని వెల్లడించారు.

జనసేన అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ, అమరావతితో అన్ని ప్రాంతాల అభివృద్ధి
అంతేకాదు జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజధాని అమరావతితో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు పని చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సంపన్న ఆంధ్రప్రదేశ్ ను చేసేందుకు జనసేన పార్టీ కంకణం కట్టుకుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అన్ని కులాలను ఐక్యంగా ఉంచటమే జనసేన పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం
సిపిఎస్ స్కీం విషయంలో ఉద్యోగులకు వైసీపీ మొండిచేయి చూపింది అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వేతన సవరణ పేరుతో ఉద్యోగుల జీతాలను తగ్గించారు అంటూ మండిపడ్డారు. పార్టీ రంగుల కోసం మూడు వేల కోట్లు, ప్రకటనల కోసం 400 కోట్లు ఖర్చు చేశారు కానీ, ఉద్యోగుల జీతాల విషయంలో వారిని ఇబ్బందులకు గురి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

25 వేల కోట్ల మద్యం ఆదాయం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతోంది
ఇదే సమయంలో పింఛన్లు, అమ్మ ఒడికి నిధులు , ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పడుతున్నాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మద్యనిషేధం పేరుతో కొత్త దుకాణాలు తెరిచి వైసీపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 25 వేల కోట్ల మద్యం ఆదాయం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతోంది అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ఆఖరికి తిరుపతిని కూడా ఆదాయమార్గంగా చూస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

పోలీస్ వ్యవస్థపైనా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మసీదు చర్చిలపై లేని ప్రభుత్వ నియంత్రణ హిందూ దేవాలయాలపై దేనికోసం అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పోలీసు వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టిస్తుంది అని, అధికార పార్టీకి భయపడుతూ పోలీసులు విధి నిర్వహణ చేయాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అవగాహన లేని మంత్రులతో ఐపీఎస్, ఐఎఎస్లకు ఇబ్బందులు
వైసిపి పాలనలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అవగాహన లేని మంత్రులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పోలీసులకు జీతాలు తోపాటు కరువు భత్యం ఇవ్వడంలేదని, పోలీసుల శ్రమను వైసీపీ సర్కార్ దోచుకుంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిత్తూరులో సీఎం వైసీపీ నేతలు చొక్కా పట్టుకొని బెదిరించారని పేర్కొన్న పవన్కళ్యాణ్ అధికార పార్టీకి భయపడుతూ పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తుందని ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలో ఆదాయం ఉన్నాసరే సద్వినియోగం చేసుకోని వైసీపీ: పవన్ కళ్యాణ్
తెలంగాణ కంటే ఆదాయం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఆదాయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు, రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు పెరిగాయని, వైసిపి పాలనలో గతంతో పోలిస్తే పది శాతం ప్రమాదాలు పెరిగి 850 మంది ప్రాణాలు కోల్పోయారు అని పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా పోతున్నాయని, ఉన్న కంపెనీలు రాష్ట్రం విడిచి పారిపోయే పరిస్థితి వచ్చిందని, పెట్టుబడులు రాకపోతే ఉపాధి అవకాశాలు రాకుండా పోతాయి అంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications