వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కొత్త ప్రణాళిక: క్షేత్ర ఫర్ జనసేన ఏర్పాటు, ఏం చేస్తారంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Elections : Janasena Prepares For New Pattern For Elections | Oneindia Telugu

అమరావతి: గ్రామస్థాయిలో జనసేన పార్టీ కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం 'క్షేత్ర ఫర్ జనసేన' టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లోకి పార్టీని తీసుకెళ్లడం, పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలలో ప్రజలను కలిసి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని జనసేనాని చెబుతున్నారు.

అలాగే, గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు 'క్షేత్ర ఫర్ జనసేన'ను ఏర్పాటు చేస్తున్నారు.

ఏపీ ఎన్నికలు: పొత్తులపై పవన్ కళ్యాణ్ తొలి అడుగు, వారికి ఇచ్చే సీట్లపై డైలమా!ఏపీ ఎన్నికలు: పొత్తులపై పవన్ కళ్యాణ్ తొలి అడుగు, వారికి ఇచ్చే సీట్లపై డైలమా!

 టీడీపీ, వైసీపీ ప్రకటించాకే జనసేన అభ్యర్థులు?

టీడీపీ, వైసీపీ ప్రకటించాకే జనసేన అభ్యర్థులు?

ఇదిలా ఉండగా, రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జనసేన అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

వారికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్

వారికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్

ఇటీవల ఆయన కర్నూలు జిల్లా నేతల సమీక్షలో మాట్లాడుతూ.. అరవై శాతం సీనియర్లకు, ఇరవై శాతం విలువలు కలిగిన వారికి, ఇరవై శాతం సిద్ధాంతపరంగా టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. ఎక్కువ మందికి రాజకీయాల్లోని సీనియర్లకే ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు టిక్కెట్లు ఇవ్వకుండా ఉండి, పార్టీకి అనుకూలంగా ఉంటే వారికి జనసేన టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

పూర్తి భిన్నంగా ఎన్నికలు

పూర్తి భిన్నంగా ఎన్నికలు

పార్టీ నిలదొక్కుకోవాలంటే యువతతో పాటు అనుభవం కలిగిన సీనియర్లు కూడా కావాలని పవన్ సూటిగా చెప్పేశారు. కాబట్టి ఆ పార్టీల్లో టిక్కెట్లు దక్కని వారిని జనసేన తరఫున ప్రకటించే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. 2014 ఎన్నికలకు పూర్తి భిన్నంగా 2019 ఎన్నికలు ఉంటాయని జనసైనికులకు అధినేత చెబుతున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan told the media that he will declare the names of the candidates contesting for the Andhra Pradesh Assembly elections soon after TDP and YSRCP announce their candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X