Pawan Kalyan: రెండు చోట్ల ఓడాక పవన్ కు జనసైనికుల ఓదార్పు లేఖ-రియాక్షన్ ఇదే..!
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జనసేన (Janasena) పార్టీకి పీడకలలా మిగిలిపోయాయి. గతంలో 2014 ఎన్నికల్లో జనసేన పార్టీని స్ధాపించినా ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. 2019లో మాత్రం తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో పరాజయం పాలయ్యారు. అలా పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయాక ఆయనకు జనసైనికులు ఓ లేఖ రాశారు. ఈ లేఖను పవన్ ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ను ఓదారుస్తున్నట్లుగా జనసైనికులు ఓ లేఖ రాశారు. ఇందులో వారు పవనన్నా.. అందరూ ఏవేవో మాట్లాడుతున్నారని, కానీ తాము అవినీతి డబ్బుతో ఓట్లు కొనలేదని, మందు పోయలేదని, గూంజాయిజం చేయలేదని చెప్పుకొచ్చారు. నీ దిశానిర్దేశంతో అభ్యర్ధులకు ప్రచారం చేశామని, నీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని వారు తెలిపారు.

ఇతర పార్టీల డబ్బు, మందు, దాదాగిరీ ముందు మనం ఓడిపోయి ఉండొచ్చని, కానీ ఇది కొనసాగనివ్వబోమని తమకు తెలుసని జనసైనికులు ఈ లేఖలో పవన్ కు తెలిపారు. ఇప్పుడు మొదటి అడుగు పడిందని, కానీ ఐదేళ్లలో ఇది 100 అడుగులకు చేరుకుటుందన్నారు. తమకు ఆత్మవిశ్వాసం ఉందని, కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందబోమన్నారు. ఈ ఓటమి కసిని నరనరాన జీర్ణించుకుని 2024కి ఎగిసే కెరటంలా సిద్దమవుతామని, కోల్పోయిన దాన్నిదారికి తెచ్చుకునే వరకూ విశ్రమించబోమన్నారు.
గెలుపోటముల్లో నీ వెంటే ఉన్నాం, ఉంటాం కూడా అని జనసైనికులు పవన్ ను ఓదార్చారు. నిజాయితీని చూసి అవినీతి ఎంతో కాలం నవ్వదని, నువ్వు ఓడిపోయావన్న బాధ కంటే నిన్ను గెలిపించుకోలేకపోయామన్న ఆవేదనని దిగమింగుకున్నామన్నారు. దీన్ని వదిలేది లేదని, తమను నడిపించాలని, ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్పించాలన్నారు. తమ జీవితాల్లో ఏం మారినా తాము పట్టుకున్నా జెండా ఎప్పటికీ మారదని, కట్టె కాలేవరకూ నీతోనే ఉంటామని వారు చెప్పుకొచ్చారు.
This letter was written post my defeat in 2019 elections.What keeps me going through in difficult times is such committed Janasainiks support and tenacity. You are all inspiring… ✊
— Pawan Kalyan (@PawanKalyan) January 18, 2024
The following group Leader didn’t stop with this letter, he came down from ‘US’ for local bodies… pic.twitter.com/G1c0iwSeuZ
దీన్ని షేర్ చేసిన పవన్.. 2019 ఎన్నికల్లో తన ఓటమి తర్వాత దీన్ని జనసైనికులు తనకు రాశారని వెల్లడించారు. కష్ట సమయాల్లో తనను నడిపిస్తున్నది అటువంటి నిబద్ధత కలిగిన జనసైనికుల మద్దతు, పట్టుదలే అన్నారు. అలాగే ఈ లేఖ రాసిన గ్రూప్ లీడర్ ఈ లేఖతో ఆగలేదని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం అమెరికా నుండి దిగి, అభ్యర్థిని నిలబెట్టి, ఆచంట నియోజకవర్గం రామన్న పాలెం ఎంపీటీసీ స్థానంలో గెలిచి 144 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చిన్న విజయం సాధించాడన్నారు. మనమందరం భౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక న్యాయం పట్ల మన హృదయం అదే ఉత్సాహంతో , నిబద్ధతతో కొట్టుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications