పిన్నెల్లి వ్యవహారంలో పవన్ మౌనం వెనుక - అసలు కారణం..!!

ఏపీలో వైసీపీ నేత పిన్నెళ్లి వ్యవహారం కలకలంగా మారింది. పిన్నెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ దక్కటంతో పిన్నెళ్లి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం కండీషన్లతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారం పైన జనసేనాని పవన్ ఇప్పటి వరకు స్పందించక పోవటం రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది.

పల్నాడులో ఉద్రిక్తత
ఏపీలో పోలింగ్ రోజున పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు జరిగాయి. పోలింగ్ జరుగుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. దీని పైన ఎన్నిక సంఘం సీరియస్ అయింది. పలు కేసులు నమోదు చేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలించారు. కాగా, పిన్నెల్లి ఈ కేసులో హైకోర్టు లో ముందస్తు బెయిల్ పొందారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ ఘటన పైన టీడీపీ నేతలు మండిపడ్డారు.

Pawan Kalyan silent over Pinnelli EVM Damagaing Episode leads to new political discussion

పవన్ మౌనం వెనుక
పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. కానీ, ఈ వ్యవహారం పైన జనసేనాని పవన్ స్పందించ లేదు. వైసీపీ నేత ఏకంగా ఈవీఎం ధ్వసం చేస్తూ వీడియో బయటకు వచ్చినా పవన్ స్పందించకపోవటం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీని వెనుక కారణాల పైన కొత్త చర్చ మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంస చేసిన సమయంలోనే టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ చేసారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి వైసీపీ వీడియోలు విడుదల చేసింది. వైసీపీ శ్రేణుల పైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన వీడియోలను బయట పెట్టింది.

అదేనా అసలు కారణం
దీంతో..పవన్ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని స్పందించటం ద్వారా టీడీపీ గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది. తెలుగు దేశ్ మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో రిగ్గింగ్ కు పాల్పడినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో..ఈ వివాదం పైన పవన్ స్పందించలేదని జనసేన వర్గాల సమాచారం. ఇక..జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపు పైన ఇప్పటికే పార్టీ నాయకత్వం సమీక్ష చేసింది. మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. జూన్ 4న కౌంటింగ్ కోసం తీసుకోవాల్సిన చర్చల పైన పార్టీ నేతలను నాయకత్వం అలర్ట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+