ఏపీలో అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా?: వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఫైర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. రోడ్ల బాగు కోసం ప్రశ్నించినవారిపై వేధింపులు, అరెస్టులను ఆయన ఖండించారు.

ఏపీలో అడుగుకో గుంత.. గజానికో గొయ్యి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏపీలో రోడ్ల పరిస్థితి 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి'లా మారిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా రోడ్ల వ్యవస్థను పటిష్టం చేస్తుంటే.. వైసీపీ పాలనలో ఉన్న ఏపీలో ఈ వ్యవస్థ దారుణంగా ఉందని అన్నారు.

ప్రశ్నిస్తే ప్రాణం తీస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం
గూడూరు మండలం తిప్పవరంలో రహదారులు అధ్వాన్నంగా ఉందని అన్నారు. రోడ్లన్నీ గోతులు, గొయ్యులు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారని తెలిపారు. ఇక్కడ ఓ గర్భిణి మహిళ ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. నియోజకవర్గంలోనూ రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు చెప్పారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. అయినా జగన్ సర్కారు నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రోడ్లు బాగు చేయాలని ప్రశ్నిస్తే జనసేనకు చెందిన ఓ కార్యకర్తను ప్రభుత్వ పెద్దలు బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. రోడ్లు బాగు చేయాలని నిరసన చేస్తే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. అక్రమ కేసులు పెరుగుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల
‘రోడ్ల’ కోసం రోడ్డుపైకి పవన్ కళ్యాణ్
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకుపైగా రోడ్లు ఉన్నాయని, చాలా చోట్ల గుంతలు, గొయ్యిలు పడ్డా.. మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్ల పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వంలో స్పందన తీసుకురావాలన్నారు. అందుకే సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో #JSPFORAP-ROADS అనే హ్యాష్‌ట్యాగ్ (సేవ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్)ద్వారా ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, ఊరు బాగు కోరే ప్రతి ఒక్కరూ పాడైన రోడ్ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మూడు వారాల్లో ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ప్రశంసించిన పవన్ కళ్యాణ్
ఇది ఇలావుండగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరును అభినందించారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేయాలి. కానీ, అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు(స్టాలిన్) మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేయాస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ కూడా 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ ఫొటోతో ముద్రితమైన బ్యాగులు, ఇతర వస్తువులనే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ప్రజాధనం వృథా చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications