ఏపీకి బాబు అనుభవం ఉపయోగం లేదు, కాఫీ-టీల కోసం వెళ్లం: పవన్ సంచలనం
Recommended Video

అమరావతి: కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనుభవం ఉపయోగం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదవి విరిచారు. శుక్రవారం పాదయాత్ర అనంతరం సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు తదితరులతో కలిసి జనసేనాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని వివరించేందుకే పాదయాత్ర చేపట్టామన్నారు.
కాఫీలు, టీల కోసం వెళ్లదల్చుకోలేదు
చంద్రబాబు పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల పక్ష సమావేశాలు కనీసం ఏడాది ముందైన పెట్టవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. అఖిల పక్షంతో ఏదో ఒరుగుతుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. కాఫీలు, టీల కోసం తాము అఖిల పక్షానికి వెళ్లేది లేదని చెప్పారు.ఇప్పుడు రాజకీయాల కోసమే టీడీపీ అఖిల పక్షం అంటోందన్నారు.

చంద్రబాబు వల్ల ఉపయోగం లేదనే
నవ్యాంధ్రకు చంద్రబాబు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయిందని, అందుకే వామపక్షాలతో కలిసి పోరాటం ప్రారంభించామన్నారు. వ్యక్తిగత లాభాలకోసం హోదా అంశాన్ని తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వం చాలా ఆలస్యంగా కళ్లు తెరిచిందని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోదా ఉద్యమాన్ని వైసీపీ, టీడీపీలు ముందుకు తీసుకు వెళ్లలేకపోయాయని చెప్పారు. ప్రభుత్వ వ్యూహం ఏమిటో మంత్రుల ద్వారా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఒత్తిళ్లకు లొంగి రాష్ట్ర ప్రభుత్వం, విపక్షం హోదా ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకు వెళ్లలేకపోయాయన్నారు. అవిశ్వాసం డిమాండ్ మొదట జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నుంచే మొదలైందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications