Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెన్త్ విద్యార్ధుల ఫెయిల్ కు కారణం మీరే-సప్లిమెంటరీ ఫీజు తీసుకోవద్దు-పవన్ కళ్యాణ్

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో దాదాపు రెండులక్షల మంది విద్యార్దులు ఫెయిలైన వ్యవహారం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటికే ప్రధాన విపక్షం టీడీపీ దీనిపై ప్రభుత్వాన్ని తప్పుబడుతుండగా.. ఇప్పుడు జనసేన కూడా ఆ జాబితాలో చేరింది.

ఏపీలో భారీగా పదో తరగతి విద్యార్ధులు ఫెయిలైన వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు, గిట్టుబాటు ధరతో రైతులకు అండగా ఉండలేరు, ధరలు అదుపులో పెట్టి సామాన్యుల్ని సంతోష పెట్టలేరు, కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అంటూ పవన్ ఇవాళ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ప్రశ్నించారు. పదో తరగతి ఫలితాలు చూస్తే ఆ పని కూడా చేయలేని చేతకాని ప్రభుత్వమని మరోసారి స్పష్టమైందన్నారు.

pawan kalyan slams jagan regime for 10th class failures,demand to exempt supplimentary fee

2018, 19 సంవత్సరాల్లో వరుసగా 94.48, 94.88 శాతం ఫలితాలు వచ్చాయని, కానీ ఈ ఏడాది మాత్రం 67.26 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీని కారణం తల్లితండ్రులే అని నిందించవద్దని సూచించారు. ఇప్పటికే రేప్ లు జరిగితే తల్లుల పెంవకం సరిగా లేదంటున్నారని, రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారు రైతులే కాదంటున్నారని, ఇప్పుడు విద్యార్ధుల ఫెయిల్యూర్స్ కు తల్లితండ్రులే కారణమని అనొద్దని పవన్ ప్రభుత్వానికి హితవు పలికారు. నాడు-నేడుతో స్కూళ్లకు 16 వేల కోట్లు పెట్టి రంగులేయించారని, ఆ వేల కోట్లు ఎటు పోయాయని పవన్ ప్రశ్నించారు.

అసలే స్కూళ్లలో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులకు మందుషాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వం నుంచి ఏం ఆశించారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. టీచర్లను మందుషాపుల డ్యూటీలు, మధ్యాహ్నభోజనం ఫొటోలు తీయించి విద్యాబోధనకు దూరం చేశారని పవన్ ఆరోపించారు. రీవ్యాల్యూయేషన్ కోసం విద్యార్ధుల్ని రూ.500 కట్టమంటున్నారని, అదేమీ కుదరని పవన్ స్పష్టం చేశారు. పరీక్ష తప్పిన పిల్లల మానసిక స్ధితిని దృష్టిలో ఉంచుకుని 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్ష ఫీజులు వసూలు చేయరాదని పవన్ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+