చంద్రబాబు సన్నిహితురాలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పవన్ కల్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు.స్నానానికి ముందు గంగామాత హారతిలో పాల్గొన్న పవన్, ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటరిచ్చారు.ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఇటీవలి జరిగిన తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్‌ను 'మృత్యు కుంభ్' అని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యనించారు. మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫైర్ అయ్యారు.

ఇన్ని కోట్ల మంది భక్తులు ఒకేచోట చేరినప్పుడు కొన్ని చిన్నచిన్న సంఘటనలు జరుగుతాయి. వాటిని విపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.సంస్కృతి, భాషాపరంగా భారతీయులు వేర్వేరు అయినప్పటికీ ధర్మంపరంగా అంతా ఒక్కటేనని పవన్ అన్నారు. దానికి ప్రతిబింబం కుంభమేళా అని తెలిపారు. కుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమని పవన్ కల్యాణ్ అన్నారు.పవన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications