అలుసుగా తీసుకోకండి ! మీకు జగనే కరెక్ట్ ! పిఠాపురంలో జనసైనికులకు పవన్ వార్నింగ్..!

ఏపీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మొదటిసారి అక్కడికి వెళ్లారు. ఉదయం తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. సాయంత్రం జనసైనికులు, వీర మహిళలకు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. అయితే ఇందులో కార్యకర్తల అత్యుత్సాహం పవన్ ను సైతం ఆగ్రహానికి కారణమయ్యేలా చేసింది.

పిఠాపురం సభలో పవన్ మాట్లాడుతుండగా.. జనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన డిప్యూటీ సీఎం పవన్.. అలుసుగా చూస్తే అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసారు. అలాంటి వారికి జగన్ అయితేనే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు తనకు శతృవులు కాదంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు.

pawan kalyan strong warning to janasena cadre in pithapuram says ys jagan suitable to you

ఐదేళ్లలో ఇప్పటికే ఒక నెల గడిచిపోయిందని, అన్నీ క్షణాల్లో జరిగిపోవాలంటే ఇక్కడ అల్లావుద్దీన్ దీపం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు ఎవరినీ తిట్టడానికి టైం లేదని, పని చాలా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి..కానీ ఖజానాలో చిల్లిగవ్వ లేదంటూ పవన్ నిర్వేదం వ్యక్తం చేశారు. మరోవైపు జనసైనికుల ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ ప్రధాని మోడీకి భద్రతగా ఉండే ఎస్పీజీ సైతం తన ఫ్యాన్స్ ను చూసి ఆయన్ను తీసుకురావొద్దని చెప్పేస్తున్నారని పవన్ చమత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+