చిరంజీవి జోలికి వస్తే సహించేదిలేదు: సజ్జలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
నరసాపురం: మెగాస్టార్ చిరంజీవి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం.. వారికి ఓటేయాలని పిలుపునివ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో, చిరంజీవి కూటమికి మద్దతివ్వడం పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు. రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సింహం కాదు.. గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. నిలబడ్డానంటే మీ అభిమానమే కారణమన్నారు. దశాబ్దంపాటు ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగింద్నారు. జగన్ లా తనపై 32 కేసులు లేవన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలిశాయన్నారు. వలసలు లేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీయే లక్ష్యమని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రజల బంగారు భవిషష్యత్తు కోసమే తాము నిలబడ్డామన్నారు పవన్. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకి నీరు కావాలన్నారు. అధికారంలోకి రాగానే అభివృద్దితోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పవన్ వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. చేతివృత్తులు, కుల వృత్తులను రక్షిస్తామన్నారు.
తక్కువ వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు పవన్. అన్నా క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయన్నారు. వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమన్న వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆక్వా పరిశ్రమను సమూలంగా ముంచేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులందర్నీ ఆదుకుంటామన్నారు. సీఎం జగన్ కులాల వారీగా విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications