వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటిక్స్: జూ. ఎన్టీఆర్ ఫెయిల్, పవన్ సక్సెస్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించి, జూనియర్ ఎన్టీఆర్ విఫమయ్యారా అనే ప్రశ్న ముందుకు వస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చీలిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి రాజకీయ ప్రాబల్యం గురించి కూడా చర్చ సాగుతోంది. నందమూరి హీరోల అభిమానుల నుంచి తన సొంత అభిమానులను కూడగట్టుకోవడంలో విఫలమై రాజకీయాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సత్తా చాటలేకపోయారని అంటున్నారు.

తాజాగా, రభస అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం కూడా ఆ చర్చను ముందుకు తెచ్చింది. బాబాయ్ బాలకృష్ణకు దీటుగా తెలుగు సినీ రంగంలో, రాజకీయాల్లో వెలిగిపోవాలని ఆశించిన జూనియర్ ఎన్టీఆర్‌కు ఎదురు దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ వైపు ప్రత్యేకంగా చీలకుండా బాలకృష్ణ విజయం సాధించారని అంటున్నారు. పైగా, ఆయన సినిమాలు కూడా మూస నుంచి బయటపడడంతో విజయాలు కూడా సాధిస్తున్నాయి.

బాలకృష్ణ, మామ నారా చంద్రబాబు నాయుడు వెంట ఉంటూనే తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాలని జూనియర్ ఎన్టీఆర్ ఆశించారు. అయితే, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో ఆయనకు వారసత్వ పోరు ఎదురైంది. ఈ వారసత్వ పోరులో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ వెనబడిపోయారు. తద్వారా ఆయన రాజకీయంగా ఇప్పుడిప్పుడే సత్తా చాటే అవకాశాలు లేకుండా పోయాయి.

Pawan Kalyan succeeds, NTR fails?

పైగా, బాలకృష్ణతో విభేదాలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే ఉంది. ఈ విషయాన్ని గమనించే ఒక సందర్భంలో బాలకృష్ణకు దగ్గరకావడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించినట్లు చెబుతారు. ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలిశారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయిలో స్వీకరించేందుకు చంద్రబాబు గానీ బాలకృష్ణ గానీ సిద్ధంగా లేరని అంటున్నారు.

ఇక, పవన్ కళ్యాణ్ దారి వేరు. ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని తన సినిమాల ద్వారా ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్‌ అభిమానుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు రాజకీయాల్లో అండగా నిలిచారు. కానీ పార్టీ అపజయం కావడంతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి, చిరంజీవి రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ రకంగా చూస్తే చిరంజీవి విజయం సాధించారనే చెప్పవచ్చు.

చిరంజీవి రాజకీయాల్లో తనదైన పద్ధతిలో, వ్యూహంతో ముందుకు సాగుతుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, అకస్మాత్తుగా జనసేన పార్టీతో ముందుకు వచ్చి, అన్నయ్య చిరంజీవిని వ్యతిరేకిస్తూ బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపి కాంగ్రెసు పార్టీని కుప్పకూల్చడంలో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు.

చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉండి, పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి వ్యతిరేకమైన కూటమిలో ఉన్నప్పటికీ మెగా అబిమానులు పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టలేదు. పైగా, పవన్ కళ్యాణ్‌ను పూర్తి స్థాయిలో అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవిపై వ్యక్తిగతంగా అభిమానం ప్రకటిస్తూనే ఆయన రాజకీయాలను తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఈ రకంగా అన్నయ్య కాదనకుండానే తనదైన రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నా కూడా దెబ్బ తినలేదు. పైగా, అభిమానులు రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు మరింత అండగా నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా విజయం సాధించినట్లే భావించాలని రాజకీయ నిపుణులు అంటున్నారు.

English summary
According to political experts - power star Pwan Kalyan has succeeded not in film world and also in politics with Jana Sena. But, Jr NTR failed to create his mark in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X