పవన్ ఫాలో అప్పా మజాకా! మిస్సింగ్ యువతిని జమ్మూ నుంచి రప్పిస్తున్న డీసీఎం..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయంపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ కంటే దూకుడుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమాన్ని రెగ్యులర్ గా నిర్వహిస్తూ ఫిర్యాదులు స్వీకరిస్తున్న జనసేనాని.. వాటిని తుదికంటా ఫాలో అప్ చేయడంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది.

తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లిపోయిన పవన్.. అక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విజయవాడకు చెందిన ఓ మహిళ తన కూతురు అదృశ్యమైందని, అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే అప్పటికప్పుడు పోలీసు అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.దీంతో పోలీసులు కూడా వెంటనే కదిలారు.

pawan kalyan s successful follow-up finds Andhra missing girl in jammu returning to vijayawada

విజయవాడలో ఏడాదిన్నర క్రితం మిస్సయిన యువతి కోసం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపు చేపట్టారు. అప్పటి ఫోన్ కాల్స్ డేటాతో పాటు ఇతర వివరాల ఆధారంగా గాలించారు. చివరికి జమ్మూలో ఆమె ఉన్నట్లు తాజాగా గుర్తించారు. దీంతో పోలీసుల్ని పంపి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+