Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!

ఏపీలో ఎన్నికల వేళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూనే, మరోవైపు కూటమి తరఫున చంద్రబాబుతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పవన్ కు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో తరచూ పవన్ జ్వరంతో బాధపడుతున్నారు.

తరచూ జ్వరం వస్తుండటంతో పవన్ కళ్యాణ్ ప్రచారం, పర్యటనలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అసలే ఎన్నికల సమయం కావడంతో ప్రచారం వదిలి విశ్రాంతి తీసుకునే పరిస్ధితి కూడా ఉండటం లేదు. దీంతో జనసేన పార్టీ ఇవాళ తమ పార్టీ శ్రేణులు, నేతలు, పవన్ అభిమానులకు ఓ కీలక సూచన చేసింది. పవన్ వద్దకు వచ్చే వారు భారీ పూలదండలు తీసుకురావొద్దని సూచించింది. అలాగే క్రేన్ లో గజమాలలు కూడా ఏర్పాటు చేయొద్దని కోరింది.

pawan kalyan suffers from recurrent influenza- party suggests cadre fans not to trouble him

పవన్ కళ్యాణ్ విజయభేరీ యాత్ర నేటి నుంచి నిరాటంకంగా కొనసాగుతుందని,రికరెంట్ ఇన్ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముజేరి రోజూ ఏదో ఒక సమయంలో జ్వరంతో ఆయన బాధపడుతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
పవన్ వద్దకు వచ్చే వారు కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని పార్టీ కోరింది. పూలు జల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

pawan kalyan suffers from recurrent influenza- party suggests cadre fans not to trouble him
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+