• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి: భయపడను..గొడవపడదాం అంటే రెఢీ : సీఎం జగన్ పై పవన్ ఫైర్..!

|

ముఖ్యమంత్రి జగన్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్రంగా మండిపడ్డారు. తన పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సీఎం తాను వైసీపీ నేతను కాదని..రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న జగన్..కావాలంటే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. ఫ్యాక్షనిజానికి..జగన్ వద్ద ఉన్న అధికారం..డబ్బుకు తాను భయపడనని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan: లాంగ్ మార్చ్ చేసినా ప్రభుత్వం దిగి రాలేదు: జగన్ సర్కార్ పై గవర్నర్ కు పవన్ కల్యాణ్ ఫిర

ఇలాగే మాట్లాడుతాం..విజయవాడలో గొడవపడదాం అంటే తాను సిద్దమని స్పష్టం చేసారు. తనను తిట్టించాలంటే ఒకే వర్గానికి చెందిన వారితో తిట్టిస్తున్నారని.. గత ఎన్నికల్లో కాపులు ఎక్కువగా జగన్ కే ఓట్లు వేసారని గుర్తు చేసారు. ఇంగ్లీషు మీడియం అమలుకు ముందు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమను తిడితే భరించటానికి టీడీపీ కాదని..జనసేన బలం తక్కువగా అంచనా వేయవద్దని పవన్ హెచ్చరించారు.

 మేము టీడీపీ కాదు భరించటానికి..

మేము టీడీపీ కాదు భరించటానికి..

ముఖ్యమంత్రి జగన్ కు పవన్ కళ్యాన్ హెచ్చరిక చేసారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్‌ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సీఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా అంటూ నిలదీసారు. అసలు టీచర్లకు ఆంగ్ల భోదన మీద శిక్షణ లేకుండా దీనిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఒక ప్రాంతంలో పరిశీలించి..ఆ తరువాత అమలుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

 జగన్ కు అటు ఇటు అయితే..వారంతా

జగన్ కు అటు ఇటు అయితే..వారంతా

వైసీపీ ఎమ్మెల్యే జగన్ ను చూసుకొని రెచ్చిపోతున్నారని..జగన్ కు అటు ఇటుగా ఏదైనా జరిగినే వారి పరిస్థితి ఏంటనేది గుర్తించాలని హెచ్చరించారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని.. జగన్ పదే పదే మాట్లాడినా సంయమనంతోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. జగన్ కు గొడవ పడాలని కోరిక ఉంటే విజయవాడలో గొడవపడేందుకు సిద్దమంటూ పవన్ వ్యాఖ్యానించారు. తమకు తెలుగు సంస్కారం నేర్పిందని పవన్ చెప్పుకొచ్చారు.ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పైన ఆ విధంగా కామెంట్లు చేయటం సరి కాదన్నారు. వైసీపీ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్‌ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని పవన్‌ ఆరోపించారు.

మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి..

మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి..

ముఖ్యమంత్రి జగన్ మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా.. అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. అదే విధంగా తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవటం కారణంగానే విజయ సాయి రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టి దొరికిపోయారా అని నిలదీసారు. ఫ్యాక్షనిజానికి.. జగన్ వద్ద ఉన్న అధికారానికి..వేల కోట్ల డబ్బులకు తాను భయపడనని స్పష్ం చేసారు. ఒక కులానికి చెందిన నేతలతోనే తనను తిట్టిస్తున్నారు. గోదావరి జిల్లాలోని కాపులు ఎక్కువగా మీకే ఓట్లు వేసారనే విషయం గుర్తుంచు కోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ను చూసుకొని రెచ్చిపోతున్నారని..జగన్ కు అటు ఇటుగా ఏదైనా జరిగినే వారి పరిస్థితి ఏంటనేది గుర్తించాలని హెచ్చరించారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని.. జగన్ పదే పదే మాట్లాడినా సంయమనంతోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. జగన్ కు గొడవ పడాలని కోరిక ఉంటే విజయవాడలో గొడవపడేందుకు సిద్దమంటూ పవన్ వ్యాఖ్యానించారు. తమకు తెలుగు సంస్కారం నేర్పిందని పవన్ చెప్పుకొచ్చారు.

English summary
Janasena chief Pawan Kalyan warned CM Jagan on his comments against Pawan three marriages. pawan suggested CM to behave like Cm not as YCP leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X