Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ తాడేపల్లి గూడెం, ఉంగుటూరు సభలు వాయిదా.. కారణమిదే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి పవన్ కళ్యాణ్ అనేక అవాంతరాలను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యంతో బాధపడుతూ తన పర్యటనను వాయిదా వేస్తున్నారు. అది మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి అడుగడుగున ఏదో ఒక రకంగా అవాంతరాలు వచ్చి పడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి మరో అడ్డంకి ఎదురైంది. పవన్ కళ్యాణ్ ప్రయాణం చేయవలసిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ టేక్ ఆఫ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ను నిలిపివేశారు.

Pawan Kalyan Tadepalligudem and Unguturu meetings postponed with helicopter technical problem

ప్రచార సభలకు వెళ్ళలేకపోయిన పవన్
ఇక పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నిలిచిపోవడంతో తాను వెళ్లవలసిన ప్రచార సభలకు వెళ్లలేకపోయారు. దీంతో పవన్ ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేశారు. ఇక ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించవలసి ఉంది. దీనికోసం పిఠాపురం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే హంసపాదు అన్నట్టు అవాంతరం ఎదురైంది.

సభలు వాయిదా.. మళ్ళీ మరోరోజు సభలు
ఇక ఈ రెండు నియోజకవర్గాలలో సభలను వాయిదా వేసినట్టు మరొక రోజు ఇక్కడ సభలను నిర్వహించనున్నట్టు జనసేన పేర్కొంది ఒకవైపు పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో ప్రచారానికి బ్రేక్ పడుతుంటే మరోవైపు రకరకాల సాంకేతిక కారణాలతో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఇబ్బంది తలెత్తుతుంది.

అనారోగ్యంతో పాటు ఇతరత్రా ఇబ్బందులు కూడా
ఏది ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యంలోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తే అందుకు ఆయనకు హెలికాప్టర్ సాంకేతిక లోపం వంటి ఇతరత్రా కారణాలు కూడా సహకరించడం లేదు. దీంతో జనసేన పార్టీ నాయకులు తాజా పరిస్థితుల పట్ల కాస్త నిరాశతో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+