పవన్ కళ్యాణ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు:రాజధాని రైతు నేతలు
Recommended Video

అమరావతి:రాజధాని కోసం రైతుల నుంచి భూ సేకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజధాని రైతు నాయకులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మతిస్థితిమితం లేకుండా మాట్లాడుతున్నారని వారు ధ్వజమెత్తారు.
తుళ్లూరులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భూముల కోసం రైతుల్ని ఎవరూ బలవంతం చేసింది లేదని...రైతులు ఇష్టపడి 33 వేల ఎకరాలు రాజధాని నిర్మాణ కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని రాజధాని రైతు నాయకులు స్పష్టం చేశారు. రాజధాని రోడ్లపై స్పష్టత లేదు, పోలీస్, రెవెన్యూ అధికారులను శత్రువులుగా చూడొద్దు...బలప్రయోగం చేస్తే ఊరుకోను...అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఇది సినిమా కాదని వారన్నారు.

పవన్ ...గందరగోళం
రాజధానిలో 320 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంటే దానిపై స్పష్టత లేదు అనడం ద్వారా అసలు పవన్ కు ఏమీ తెలియదని అర్ధమవుతోందని వారు దుయ్యబట్టారు. 144 సెక్ష్షన్, పోలీసుల కాల్పులు అని పవన్ కల్యాణ్ రాజధానిలో గందరగోళం సృష్టిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీకు...ఎలా తెలుస్తుంది?...
హైదరాబాద్‌లో సినిమాలు తీసుకునే పవన్ కళ్యాణ్ కు రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి ఏం తెలుసని...ఎలా తెలుస్తుందని రైతు నాయకులు ప్రశ్నించారు.

ఆగ్రహానికి గురవుతావు...జాగ్రత్త
రాజధానిలో అభివృద్ధి జరుగుతుంటే గజిబిజి చేసి రైతుల ప్లాట్లకు విలువ తగ్గేవిధంగా...ఆరకంగా ఎవరు ప్రవర్తించినా రైతుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ప్రతి సారి ఉద్యమం చేస్తామంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యానాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజధాని అభివృద్ధి ప్రత్యక్షంగా చూసి వ్యాఖ్యలు చేయాలని హితవు పలికారు.

హెచ్చరించిన...రైతు నేతలు
రాజధాని భూములపై పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతునాయకులు నూతక్కి కొండయ్య, అనుమోలు సత్యనారాయణ, కాటా అప్పారావు, నెలకుదిటి వెంకటేశ్వరావు, ముళ్లమూడి రవి, మూలుపూరి రాంబాబు, కారంపూడి శ్రీనివాసరావు, సరిపూడి సాంబయ్య, నూతలపాటి రామారావు, నేలపాడు సర్పంచ్ ధనేకుల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications