Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ వల్లే నెట్టేయబడ్డాం: టిపై పవన్, షర్మిలకు చురక

చిత్తురు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిల పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ పాపం వైయస్‌దేనని మండిపడ్డారు. ఆయన చిత్తూరు జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు.

తాను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు పదవుల పైన ఎలాంటి మమకారం లేదన్నారు. తాను ఒంగోలు వీధి బడిలో చదివానని, తాను ఎక్కడి నుండి వచ్చానో మర్చిపోలేదన్నారు. తాను సామాన్యుడిగా ఉండేందుకే ఇష్టపడతానని, అందుకే ఎక్కువగా బయటకు రానని చెప్పారు.

Pawan Kalyan targets Sharmila and YSR

కొంతమందికి తాను ఆవేశపరుడిలా కనిపిస్తానని, తనకు ఆలోచన లేదని, ఏది పడితే అది మాట్లాడుతుంటానని, తిక్కే ఉంది కానీ లెక్క లేదంటారని కానీ తాను ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానని షర్మిలకు చురకలు అంటించారు. వైయస్ హయాంలో రాష్ట్రం అన్యాయానికి గురైందన్నారు. ఒకరి సంపాదన మరొకరిని ఏడిపించవద్దన్నారు.

కానీ వైయస్, ఆయన బంధువుల సంపద అందరి చేత కంటతడి పెట్టించిందన్నారు. అన్యాయం, దోపిడీ, వంచన జరుగుతున్నప్పుడే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను ఎందుకు తిట్లు పడాలన్నారు. ప్రజల కోసమే బయటకు వచ్చానని చెప్పారు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తిగా తాను పెరిగానని చెప్పారు.

తన స్థాయిని తాను ఎప్పుడు మర్చిపోలేదన్నారు. 2004లో తర్వాత వైయస్ చేసిన దోపిడీ విధానం తనకు బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు హయాంలో ఇంత జోరుగా తెలంగాణ ఉద్యమం ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. వైయస్ ఆయన అనుచరుల సంపద ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే స్థాయికి పోయిందన్నారు.

గాంధీ భవన్ కోసం బీంరావుబాడా బస్తీని రాత్రికి రాత్రి ఖాళీ చేయించారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు తనకు బాధ కలిగించిందన్నారు. అందుకే కాంగ్రెసు నేతల పంచెలు ఊడేలా తరిమి కొట్టాలని 2009లో పిలుపునిచ్చానని చెప్పారు. 2004కు ముందు చంద్రబాబు పాలనలో అభివృద్ధి ఉంది కాబట్టే తెలంగాణ కోరుకున్నా.. అంత బలంగా లేదన్నారు.

ఆ తర్వాత వైయస్ పాలనలో దోచుకున్నందునే ఉద్యమం ఊపందుకుందని చెప్పారు. విభజనకు ఆయనే కారణమని అభిప్రాయపడ్డారు. వైయస్ దోపిడీ, అరాచకం, కెసిఆర్ మాటలు తనకు విసుగు, అసహనం కలిగించాయని, అందుకే మంచిగా చెప్తే అర్థం కాదని ఇలా వచ్చానని చెప్పారు. తాను తిట్టేలా కెసిఆరే చేశారన్నారు. కొన్నిసార్లు సాయుధ పోరాటం చేయాలనిపిస్తోందన్నారు.

తాను నటుడినని, వైయస్ మీద తిరుగుబాటు చేసేందుకు తనకే అవసరమని కానీ, ప్రజల కోసం తప్పదన్నారు. వైయస్ బంధువు ఒకరు వచ్చి తనతో సినిమా చేయాలని తనను బెదిరించాలని, ఆయన బెదిరిస్తే తాను భయపడతానా అన్నారు. ప్రేమిస్తే అంతకు వంద రెట్లు అభిమానిస్తానని, బెదిరిస్తే అంతే ధీటుగా స్పందిస్తానని చెప్పారు.

వైయస్ బాగా పాలిస్తే కెసిఆర్‌కు పిచ్చి మాటలు వచ్చి ఉండేవి కాదని, ఆయన సీమాంధ్రులను తిట్టక పోయి ఉండేవాడన్నారు. వైయస్ వల్లనే కెసిఆర్‌కు సీమాంధ్రులు అలుసయ్యారన్నారు. ఈ నాలుగేళ్లలో తెరాస వల్ల ఎంత అవస్తలు పడ్డామో సీమాంధ్రులకు తెలుసునని చెప్పారు. తనకు సీమాంధ్రలో ఎలా అభిమానులు ఉన్నారో.. తెలంగాణలోను అలాగే ఉన్నారని చెప్పారు.

తనకు సినిమాలు చేసుకుంటే హాయిగా డబ్బులు వస్తాయన్నారు. ఎంత కాలం జీవిస్తామని, శ్వాస ఉన్నంత వరకే మనిషికి ఆశ అన్నారు. వైయస్, కెసిఆర్ తీరు తనకు విసుగు తెప్పించిందన్నారు. తనకు తెగింపు ఎక్కువని, ప్రాణాలు కూడా లెక్క చేయనని చెప్పారు. వైయస్ వల్లే మనం తెలంగాణ నుండి నెట్టివేయబడ్డామన్నారు. కెసిఆర్ లాంటి వాళ్లకు అలుసయ్యామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+