ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్, అయిదేళ్ల తరువాత - పవన్ ఇక షురూ..!!
ఏపీకి కేంద్రం దసరా వేళ కానుక ప్రకటించింది. 15వ ఆర్దిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఏపీకి రూ.988.77 కోట్లు దక్కాయి. ఇదే సమయంలో నేటి నుంచి ప్రభుత్వం పల్లె పండుగ పేరుతో పంచాయతీ వారోత్సవాల నిర్వహించనుంది. అయిదేళ్లు తరువాత 3 వేల కి.మీ. సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేయనున్నారు. కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
కేంద్ర నిధులు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ దీనికి సంబంధించి ప్రణాళికా బద్దంగా వెళ్లాలని అధికారులకు నిర్దేశించారు. కేంద్రం నుంచి ఆర్దిక సంఘం నిధులు రూ 988.77 కోట్లు విడుదల అయ్యాయి. అందులో అందులో.. అన్‌టైడ్ గ్రాంట్లు రూ.395.50 కోట్లు, టైడ్ గ్రాంట్లు రూ.593.26 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్రంలో ఎంపిక చేసిన 9 జిల్లా పరిషత్‌లు, 615 మండల పరిషత్‌లు, 12,853 గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

పల్లె పండుగ
పంచాయతీల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని ఉపయోగించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న 'పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల'కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు 14న సోమవారం భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్నీ జిల్లాల్లో కలెక్టర్లు గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3 వేల కి.మీ మేర సిమెంట్ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమిపూజలో పాల్గొంటారు. అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు.
Villages of the state are set on the path of progress with the "Palle Panduga"
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 13, 2024
In line with the resolutions passed in the Grama Sabhas held across the state on August 23 under the Panchayat Raj Department, the Government of Andhra Pradesh is launching development activities from… https://t.co/jv22CWqRI5
నేటి నుంచి ప్రారంభం
గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సిమెంట్ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా రూ.270 చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీల నుంచి సేకరించాలని పేర్కొంది. రానున్న సంక్రాంతి నాటికి సిమెంట్ రోడ్లును ప్రారంభించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఐదేళ్ల తర్వాత చేపట్టనున్న సిమెంట్ రోడ్ల భూమిపూజను ఒక పండుగలా ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications