ముద్రగడతో పవన్ భేటీ - జనసేనలోకి ఎంట్రీ, కండీషన్స్ అప్లై..!!
ఏపీ ఎన్నికల్లో సామాజిక లెక్కలు కీలకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ఈ లెక్కలకే ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపు ఓటింగ్ తమ వైపే ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ వైసీపీలో వెళ్తారనే ప్రచారంతో అలర్ట్ అయ్యారు. జనసేన నేతలు నేరుగా ముద్రగడతో చర్చలు చేసారు. ఇక..ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగుతున్నారు.
జనసేనలోకి ముద్రగడ: కాపు ఉద్యమనేత ముద్రగడతో జనసేన నేతలు వరుస మంతనాలు సాగిస్తున్నారు. ముద్రగడ పార్టీలో చేరటం పైన చర్చ చేసారు. ముద్రగడతో తొలి సమావేశంలో పార్టీలో చేరిక పైన సానుకూల సంకేతాలు ఇచ్చారు. పవన్ గత వారంలో కాపులంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందంటూ లేఖ రాసారు.

దీంతో జనసేన నేతలు ముద్రగడతో టచ్ లోకి వచ్చారు. వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా అమలు చేయటంలో చోటు చేసుకున్న పరిణామాలతో ముద్రగడ ఇక వైసీపీలోకి వెళ్లకూడదని నిర్ణయించారు. కాకినాడ జిల్లాలో వైసీపీ తమ అభ్యర్దులను దాదాపు ఖరారు చేసింది. తనకు ప్రాధాన్యత ఇవ్వవటం లేదని..గుర్తింపు లేని పార్టీలోకి తాను వెళ్లలేనని ముద్రగడ తన సన్నిహితులతో చెబుతున్నారు.
కిర్లంపూడికి పవన్: జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్, ఆ తరువాత టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వరుసగా భేటీ అయ్యారు. ఈ రోజు మరోసారి బొలిశెట్టి వాసు కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయ్యారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు స్వయంగా పవన్ వస్తున్నారని సమాచారం ఇచ్చారు. ఈ నెల 20 లేదా 23న కిర్లంపూడిలో ముద్రగడతో పవన్ భేటీ కానున్నారు.
పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అదే సమయంలో ముద్రగడకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యత పైన హామీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ముద్రగడ కు ఎంపీ సీటు..ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు పవన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ముద్రగడను కాకినాడ ఎంపీగా.. ఆయన తనయుడుకు పెద్దాపురం లేదా ప్రత్తిపాడు సీటును కేటాయించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.
మారుతున్న లెక్కలు: ఇదే సమయంలో టీడీపీపైన గత నాలుగేళ్ల కాలంగా ముద్రగడ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు కొనసాగిస్తున్న వేళ ఆ పార్టీలో చేరేందుకు ముద్రగడ సిద్దం కావటం పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో జనసేన నుంచి గతంలో ప్రతిపాదించిన విధంగా 20-25 సీట్ల స్థానంలో 40 సీట్ల వరకు జనసేనాని డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
దీంతో, ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ముద్రగడ జనసేనలో చేరటం ద్వారా రాజకీయంగా కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ముద్రగడ జనసేన లో చేరిక..కాపు వర్గం ఓటింగ్..సామాజిక సమీకరణాలు..ఫలితాల పైన ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications