గాంధీ జయంతి సాక్షిగా జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ వాగ్బాణాలు!!

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో మహాత్మా గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించారు. జై జవాన్ , జై కిసా అంటూ దేశ ప్రజల్లో ప్రధానిస్ఫూర్తి రగిలించిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, అహింసే పరమ ధర్మంగా సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్ముని జయంతి సందర్భంగా వారిరువురికీ నివాళులు అర్పించారు.

నేడు మౌన దీక్షలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, అంతకుముందు రాష్ట్ర పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహాత్ముడి బాటలో నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు నడిచారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan tribute on gandhi jayanti and made sensational comments on jagan govt

మన దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని, గాంధీజీని వేర్వేరుగా చూడలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు . అహింసా యుత ప్రజా పోరుతో పరాయి పాలన నుండి భారతదేశాన్ని విముక్తం చేశారని పేర్కొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్ముడిని స్మరించుకుంటూ మనస్పూర్తిగా అంజలి ఘటిస్తున్నాను అని స్పష్టం చేశారు.

అంతేకాదు ఇదే సమయంలో వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఓటు సత్యాగ్రహం విలువను గాంధీజీ తెలియ చెప్పారని పేర్కొన్న ఆయన ఆ ఆయుధాలను ఉపయోగించి నయా బ్రిటిష్ పాలకులను రాష్ట్రం నుంచి పంపించడం మన ధర్మంగా రాష్ట్రప్రజలు భావించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదని అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైసిపి నేతలు దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో రెండు గంటల పాటు పవన్‌ మౌన దీక్షలో పాల్గొంటున్నారు.

గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికలు చాలా కష్టమైనవని, బ్రిటిష్ వారికి ఉన్న సంయమనం కూడా లేదు మన రాష్ట్ర నాయకులకు లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు సమకాలీన రాజకీయాలు సంయమనంతో ఉంటాయని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. కలుషితమైన రాజకీయాల నుంచీ జనసేన అనే కమలం వికసిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+