అవమానిస్తున్నారు: హోదాపై బిజెపిని వదిలిపెట్టేది లేదన్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్.. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట తప్పిందని అన్నారు. కంటితుడుపుగానే ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొన్నారు.

కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో ప్రత్యేక అనే పదం తప్ప ఏమీలేదని దుయ్యబట్టారు. దశాబ్దంపాటు ఆంధ్రులు అన్యాయానికి గురయ్యారని అన్నారు. రాజధాని లేకుండా భారీ ఆదాయ లోటును రాష్ట్రానికిచ్చారని పేర్కొన్నారు. ఏపీ ప్రజలను వెన్నెముక, ఆత్మాభిమానం లేనివారిగా చూస్తూ అవమానిస్తున్నారని మండిపడ్డారు.
— Pawan Kalyan (@PawanKalyan) 18 December 2016
— Pawan Kalyan (@PawanKalyan) 18 December 2016
— Pawan Kalyan (@PawanKalyan) 18 December 2016
— Pawan Kalyan (@PawanKalyan) 18 December 2016
ఏపీకి ప్రత్యేక హోదా పై బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ' 'జై ఆంధ్ర' ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న 400 మందికి పైగా విద్యార్థులపై మేము ప్రమాణం చేసి చెబుతున్నాము.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, అందుకు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టం' అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ నే వేదికగా చేసుకుని ప్రశ్నలు సందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక హోదా అంశంపై కూడా ఆయన ట్విట్టర్ వేదికగానే స్పందించారు. సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పలు సమస్యలపై స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications