వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ వారాహి వివాదం... క్లారిటీ ఇచ్చిన జనసేన; ఇలా అయితే ఏపీలో రచ్చ తప్పదా!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్ బ్యాటిల్ కోసం సిద్ధం చేసుకున్న వాహనం వారాహి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి వాహనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారాహి వాహనానికి వేసిన రంగు పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా వైయస్సార్సిపి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి, సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది.

వారాహి వాహనం కలర్ పై జనసేన క్లారిటీ

వారాహి వాహనం కలర్ పై జనసేన క్లారిటీ

ఈ క్రమంలో వారాహి వాహనానికి వేసిన రంగు పై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో వైయస్సార్ సిపి ప్రభుత్వం పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు వేసినట్లుగా పేర్కొంది. విశాఖపట్నం లో జనసేన ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశమైన క్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ వివాదం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హైకోర్టులో లెక్కకు మించి మొట్టికాయలు.. మీరు కూడా మాట్లాడతారా?

హైకోర్టులో లెక్కకు మించి మొట్టికాయలు.. మీరు కూడా మాట్లాడతారా?


వారాహి వాహనం కలర్ పై జరుగుతున్న వివాదంపై జనసేన పార్టీ విడుదల చేసిన లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. హైకోర్టులో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ వైసీపీ ని టార్గెట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వాళ్ల మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ఏ రంగు వేశారో చూడకుండానే రవాణా శాఖ అనుమతి ఇస్తుందా?

ఏ రంగు వేశారో చూడకుండానే రవాణా శాఖ అనుమతి ఇస్తుందా?

వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగానే రూపుదిద్దుకుందని పేర్కొన్న ఆయన, పవన్ కళ్యాణ్ నిబంధనలకు లోబడే ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఏ రంగు వేశారో చూడకుండానే రవాణాశాఖ ఎలా అనుమతి ఇస్తుందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇది కావాలని వైసిపి చేస్తున్న వివాదంగా ఆయన అభివర్ణించారు. ఏపీఎస్ఆర్టీసీ ని వైసిపిఆర్టీసీ గా మార్చిన నాయకులకు, పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులలో జనాన్ని తరలిస్తూ ప్రయాణికులకు అవస్థలు కలిగించిన నాయకులకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల డబ్బులతో వైసీపీ రంగులు .. మీకేం నిబంధనలు తెలుసు

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల డబ్బులతో వైసీపీ రంగులు .. మీకేం నిబంధనలు తెలుసు

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల డబ్బులతో వైసిపి రంగులు వేసే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి అంటూ చురకలంటించారు. ఇక ఆ పార్టీ నాయకుల నుండి ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ అసహనం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది అని పేర్కొన్న ఆయన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభద్రతాభావం లో ఉందని అందుకే వారాహి వాహనం గురించి విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయడం వాళ్ల సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్న ఆయన వైసిపి కుట్రలను సాంకేతికత సహాయంతో అడ్డుకోవాలంటూ పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ దుర్నీతిని జనాల వద్దకు తీసుకెళ్ళాలి

వైసీపీ ప్రభుత్వ దుర్నీతిని జనాల వద్దకు తీసుకెళ్ళాలి

పాలనలోకి వచ్చి మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముప్పై చెరువుల నీళ్లు తాగించిన వైసీపీ ప్రభుత్వ దుర్నీతిని ఏ మాత్రం భయపడకుండా జనాల వద్దకు చేరవేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన సైనికులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే పని చేయాలన్నారు. రాజకీయంగా పూర్తి చైతన్యవంతులై, ఏడాది కాలం పాటు జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు చేరవేయడం కోసం పని చేయాలని సూచించారు. ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే భయపడ్డారని, ఉలిక్కిపడ్డారు అని అది నిజాయితీకి ఉన్న దమ్ము అంటూ పేర్కొన్న నాదెండ్ల మనోహర్, అటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పని చేయడం తమ అదృష్ట మన్నారు.

వారాహి వాహనం రంగు మార్చకుంటే రచ్చేనా?

వారాహి వాహనం రంగు మార్చకుంటే రచ్చేనా?


ఇక వారాహి వాహనంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను నాదెండ్ల మనోహర్ కొట్టిపారేశారు. ఇక ఈ క్రమంలో వాహనం రంగు మార్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వాహనాన్ని తిరగనిస్తారా? ప్రభుత్వం అభ్యంతరం కచ్చితంగా వ్యక్తం చేస్తుంది అన్న చర్చ జరుగుతుంది. అది రచ్చగా మారుతుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక ఈ వివాదంలో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.

English summary
Pawan Kalyan party Janasena has given clarity on the Varahi controversy. YSRCP targeted and criticized the govt. According to the rules, Varahi color is there. With this, there is a possibility that the uproar in AP will continue in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X